BREAKING
ఆల్ఫోర్స్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో ఘనంగా ముందస్తు బతుకమ్మ వేడుకలు చెత్త బుట్టలో మృత శిశువులభ్యం ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలి: వాసిరెడ్డి సీతారామయ్య జాతీయస్థాయి సాఫ్ట్‌బాల్‌లో మైథిలి సత్తా బంగారు పతకంతో మెరిసిన దాడితోట జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థిని భారత పరివర్తనకు, పెరుగుతున్న ఆకాంక్షలకు నిదర్శనం: ఏపీ సీఎం చంద్రబాబు ప్రశంసలు! నేడు అమరచింతకు మంత్రి రాక.. ఆపరేషన్ నైట్ సేఫ్టీతో పోలీసుల నిఘా ముమ్మరం ప్రజల ప్రాణ, ఆస్తుల భద్రతే తొలి ప్రాధాన్యత: జిల్లా ఎస్పీ పి. జగదీష్‌ ఐటీ క్యూ2 ప్రివ్యూ: మందకొడిగా వృద్ధి, ఆకర్షణీయమైన వాల్యుయేషన్లు.. టాప్ పిక్స్‌గా టెక్ మహీంద్రా, ఎల్‌టీఐమైండ్‌ట్రీ: ఆనంద్ రాఠీ నివేదిక! టాటా సన్స్ లిస్టింగ్ వివాదం: వేణు శ్రీనివాసన్, విజయ్ సింగ్‌లపై ఎస్‌డీటీటీ ట్రస్టీల తీవ్ర ఆగ్రహం.. బోర్డు తీర్మానాలను ఉల్లంఘించారని ఆరోపణ! తగ్గిన చమురు ధరలు, బాండ్ ఈల్డ్స్: లాభాల్లో దూసుకుపోతున్న అమెరికా స్టాక్ మార్కెట్లు.. ఎస్ అండ్ పీ, నాస్‌డాక్ జంప్! చౌకైన మ్యాక్‌కూ అత్యంత ఖరీదైన డివైజ్‌ల స్థాయి ప్రాధాన్యత: యాపిల్ సీఈవో జాన్ టెర్నస్ కీలక వ్యాఖ్యలు! ఓకే ఫోన్ ..రూ కోట్ల ఆయిల్ దందా! యూకే వైమానిక స్థావరం నుంచి వ్యూహాత్మక బాంబర్లను ఉపసంహరించిన అమెరికా జపాన్‌లో అక్కినేని నాగార్జున శివ సినిమా సంచలనం.. జపాన్ ఫ్యాన్స్ ఇచ్చిన క్రేజీ బిరుదు ఇదే! షారుక్‌ ఖాన్‌ కింగ్ మూవీలో కరీనా కపూర్‌ స్పెషల్‌ సాంగ్‌.. సౌతాఫ్రికాలో షూటింగ్!

ఆపరేషన్ నైట్ సేఫ్టీతో పోలీసుల నిఘా ముమ్మరం ప్రజల ప్రాణ, ఆస్తుల భద్రతే తొలి ప్రాధాన్యత: జిల్లా ఎస్పీ పి. జగదీష్‌

Select Suryaa Now
ఆపరేషన్ నైట్ సేఫ్టీతో పోలీసుల నిఘా ముమ్మరం ప్రజల ప్రాణ, ఆస్తుల భద్రతే తొలి ప్రాధాన్యత: జిల్లా ఎస్పీ పి. జగదీష్‌

అనంతపురం బ్యూరో: జిల్లాలో నేరాల నియంత్రణ, రాత్రి వేళల్లో ప్రజలకు భద్రత కల్పించడం, శాంతిభద్రతలను పరిరక్షించడమే లక్ష్యంగా జిల్లా పోలీసు యంత్రాంగం “ఆపరేషన్‌ నైట్‌ సేఫ్టీ” కార్యక్రమాన్ని ముమ్మరం చేసింది. జిల్లా ఎస్పీ పి. జగదీష్‌  ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా పోలీసులు రాత్రివేళల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు.

జిల్లాలోని ప్రధాన జంక్షన్లు, అంతర్రాష్ట్ర, అంతర్‌జిల్లా సరిహద్దులు, సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించిన పోలీసులు వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. పలుచోట్ల నాకాబంధీ నిర్వహించడంతో పాటు ఫుట్‌ పెట్రోలింగ్‌ చేపట్టి రాత్రివేళల్లో ప్రజలకు భద్రతా భావాన్ని కల్పించారు.

అనుమానితులపై ప్రత్యేక నిఘా

రాత్రి వేళల్లో ఎలాంటి కారణం లేకుండా సంచరిస్తున్న అనుమానితులను పోలీసులు తనిఖీ చేశారు. పాత నేరస్తుల కదలికలపై కూడా నిఘా ఉంచి, అనుమానాస్పదంగా కనిపించిన వారిని అదుపులోకి తీసుకుని విచారించారు. నేరాలకు ఆస్కారం లేకుండా ముందస్తు చర్యల్లో భాగంగా ఈ తనిఖీలు కొనసాగించినట్లు పోలీసులు తెలిపారు.

డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌పై కఠిన చర్యలు

రాత్రి వేళల్లో మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో పోలీసులు ప్రత్యేకంగా డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీలు చేపట్టారు. మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారిపై కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకున్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ఇటువంటి తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని పోలీసులు స్పష్టం చేశారు.

బస్టాండ్లు, రైల్వే స్టేషన్ల వద్ద భద్రత

రాత్రిపూట ప్రయాణించే ప్రజల భద్రతకు పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, నిర్మానుష్య ప్రాంతాల్లో పోలీసు సిబ్బంది పర్యటిస్తూ పరిస్థితులను పర్యవేక్షించారు. ఏటీఎం కేంద్రాలు, బ్యాంకుల వద్ద కూడా భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు.

అనుమానాస్పద కదలికలపై సమాచారం ఇవ్వాలి

ప్రజల ప్రాణ, ఆస్తుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని పోలీసులు తెలిపారు. నేరాల నియంత్రణ కోసం “ఆపరేషన్‌ నైట్‌ సేఫ్టీ” తనిఖీలు ఇకపై కూడా నిరంతరం కొనసాగుతాయని స్పష్టం చేశారు. రాత్రివేళల్లో అకారణంగా సంచరిస్తూ శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.

అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలు లేదా సంఘటనలు కనిపించినప్పుడు ప్రజలు వెంటనే డయల్‌ 100/112కు లేదా సమీప పోలీస్‌స్టేషన్‌కు సమాచారం అందించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. ప్రజలు పోలీసులకు సహకరిస్తే నేరాల నియంత్రణ మరింత సమర్థవంతంగా సాధ్యమవుతుందని పేర్కొన్నారు.