ఏడాది గడిచినా చెల్లని విద్యుత్ బిల్లులు! •
వెల్దుర్తి, సూర్య మేజర్ న్యూస్ మేజర్ గ్రామపంచాయతీ పరిధిలో వీధిదీపాలు, సచివాలయాల నిర్వహణకు కొనుగోలు చేసిన ఎలక్ట్రికల్ సామాగ్రి బిల్లుల చెల్లింపుల్లో పంచాయతీ అధికారులు తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారు. సామాగ్రి అందజేసి ఏడాది కావస్తున్నా ఇప్పటికీ బిల్లులు మంజూరు చేయకపోవడంతో సంబంధిత వ్యాపారి పంచాయతీ కార్యాలయం చుట్టూ తిరగాల్సి వస్తోంది.
లక్ష దాటిన బకాయిలు:వెల్దుర్తి మేజర్ పంచాయతీ, గ్రామ సచివాలయ పరిధిలో వీధిదీపాల ఏర్పాటు, రిపేర్ల కోసం 'అశోక్ ఏజెన్సీస్' నుంచి స్ట్రీట్ లైట్లు (36 W), సర్వీస్ వైర్లు, ఎంసీబీ బాక్సులు, పోల్ పట్టీలు తదితర విద్యుత్ సామాగ్రిని కొనుగోలు చేశారు.
తేదీ 8/9/2025 నాటి బిల్లు ద్వారా రూ. 38,278/- విలువైన సామాగ్రి,
తేదీ 10/11/2025 నాటి బిల్లు ద్వారా రూ. 65,372/- విలువైన సామాగ్రి తీసుకున్నారు.
దీనికి తోడు మరికొన్ని ఎలక్ట్రికల్ సామాగ్రికి సంబంధించి రూ. 7,009/- ల బిల్లును కూడా ఈవో గారికి సమర్పించారు. మొత్తంగా రూ. 1,10,659/- (లక్షా పదివేల ఆరువందల యాభైతొమ్మిది రూపాయలు) విలువైన బిల్లులను పంచాయతీ కార్యాలయంలో మంజూరు చేయకుండా ఏడాది కాలంగా పెండింగ్‌లో పెట్టారు.
కార్యాలయం చుట్టూ కాళ్లరిగేలా..
సరుకు అందజేసి, బిల్లులు పెట్టి ఒక సంవత్సరం పూర్తవుతున్నా పంచాయతీ అధికారులు పట్టించుకోవడం లేదని సదరు వ్యాపారి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రేపు, మాపు అంటూ తిప్పుకుంటూ కాలయాపన చేస్తున్నారని మండిపడుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత ఉన్నతాధికారులు స్పందించి, పెండింగ్‌లో ఉన్న ఎలక్ట్రికల్ బిల్లులను తక్షణమే విడుదల చేయాలని కోరుతున్నారు.
సూర్య ప్రతినిధి షేక్ దస్తగిరి వెల్దుర్తి మండలం కర్నూలు జిల్లా