కరీంనగర్‌లో బైక్ దొంగ అరెస్ట్: మోటార్ సైకిల్ స్వాధీనం
సూర్య - కరీంనగర్ :కరీంనగర్ పట్టణంలో బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న ఒక నిందితుడిని టాస్క్ ఫోర్స్ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. కరీంనగర్‌లోని హౌసింగ్ బోర్డ్ కాలనీకి చెందిన ఎండి మక్బూల్ (తండ్రి: గఫార్) అనే వ్యక్తి ద్విచక్ర వాహనాల చోరీకి పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఏసీబీ టాస్క్ ఫోర్స్ అధికారుల పక్కా సమాచారంతో, సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన తనిఖీల్లో ఈ నేరస్తుడిని అదుపులోకి తీసుకున్నారు.నిందితుడి వద్ద నుంచి ఒక హీరో కంపెనీకి చెందిన మోటార్ సైకిల్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పట్టుబడిన నేరస్తుడిని, స్వాధీనం చేసుకున్న బైక్‌ను తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తం కరీంనగర్ రెండవ పట్టణ (టౌన్-2) పోలీస్ స్టేషన్‌కు అప్పగించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న టౌన్-2 పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.