BREAKING
ఘనంగా ప్రారంభమైన దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు నర్సీపట్నం మున్సిపాలిటీలో పోలింగ్ కేంద్రాల పరిశీలన " సామాజిక సేవ నుండి ప్రజా క్షేత్రం వైపు " శివాలయంలో శరన్నవరాత్రుల ప్రారంభం అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఆర్థిక సహాయం అందించిన కాంగ్రెస్ నాయకులు తాటి బాలు త్రివిధ దళాల మాజీ సైనికులతో బిజెపి రాష్ట్ర చీఫ్ సమావేశం.. బాలా త్రిపుర సుందరీ దేవి అవతారంలో పోలమాంబ దర్శనం రైలు ఢీకొని 130 గొర్రెలు మృతి! 26వ వార్డులో రూ. 40 లక్షలతో కళ్యాణ మండపానికి శంకుస్థాపన అన్నదాన కార్యక్రమానికి రూ.లక్ష విరాళం లయన్స్ క్లబ్ సౌజన్యంతో విజ్ఞాన భారతిలో మొక్కలు నాటే కార్యక్రమం.. మినీ గురుకులాల సిబ్బందిని రెగ్యులర్ చేయాలి ఆలయాన్ని సందర్శించిన పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ మాధవానంద సరస్వతి స్వామి. * చారిత్రక సంపదను కాపాడుకోవడం భక్తుల బాధ్యత బుధవారం నాడు జాబ్ మేళా అంపిలి లో అంబికా అమ్మవారి కిరీటం తయారికి 1.50 లక్షలు విరాళం

ప్రారంభమైన శ్రీ శ్రీ రాజరాజేశ్వరి దేవీ శరన్ననవరాత్రి ఉత్సవాలు. మొదటి రోజు శ్రీ బాల త్రిపుర సుందరి దేవి అలంకరణ.

Select Suryaa Now
ప్రారంభమైన శ్రీ శ్రీ రాజరాజేశ్వరి దేవీ శరన్ననవరాత్రి ఉత్సవాలు. మొదటి రోజు శ్రీ బాల త్రిపుర సుందరి దేవి అలంకరణ.

 చింతపల్లి మేజర్ న్యూస్. చింతపల్లి మండల వ్యాప్తంగా వివిధ గ్రామాలలో శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. మొదటి రోజు శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి అలంకారంలో దుర్గాదేవి భక్తులకు దర్శనమిచ్చారు. మాల్ శ్రీ గాయత్రి పీఠంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. అమ్మవారిని శ్రీ బాల త్రిపుర సుందర దేవిగా అలంకరణ చేశారు. ఉదయం గణపతి పూజ కంకణ దారుణ కలశ స్థాపన నవగ్రహారాధన   ధ్వజారోహణము సామూహిక కుంకుమార్చన కార్యక్రమాలు హోమాలు నిర్వహించారు. వేద బ్రాహ్మణులు శ్రీ  క్రొవిడి. సాయిబాబా శాస్త్రి దంపతులు కుటుంబ సభ్యులు భక్తులు తదితరులు ఉన్నారు. అదేవిధంగా  మాల్ వెంకటేశ్వర నగర్ శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో శ్రీ శ్రీశ్రీ రాజరాజేశ్వరి దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. చైర్మన్ ఊరే .లక్ష్మణ్ శ్రీదేవి మాట్లాడుతూ ప్రతిరోజు ఉదయం సామూహిక లలితా సహస్రనామ కుంకుమార్చన, హోమములు, మరియు మహాన్న ప్రసాద వితరణ జరుగుతుందని వారు తెలిపారు. మొదటిరోజు అమ్మవారు శ్రీ బాల త్రిపుర సుందరి దేవిగా అలంకరణ చేశారు. మాల్ శ్రీ బాలాజీ కిరాణం అండ్ జనరల్ స్టోర్ ఊరే. ధనలక్ష్మి బాలరాజు, ఊరే గీతా .సురేష్ బాబు దంపతులు తొమ్మిది రోజులు అమ్మవారికి చీరల దాతగా ఉన్నారు. పూజారి బ్రహ్మశ్రీ  మోకిరాల. శ్రీకాంత్ శర్మ పూజ కార్యక్రమం నిర్వహించారు. అదేవిధంగా గోడకొండ్ల గ్రామంలో వివిధ మండపాల వద్ద  అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి పూజా కార్యక్రమం నిర్వహించారు. తక్కలపల్లి, పోలేపల్లి రాంనగర్, చాకలీ శేరిపల్లి, వెంకటం పేట, ఆయా గ్రామాలలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి పూజా కార్యక్రమం నిర్వహించారు. చింతపల్లి సాయిబాబా దేవాలయంలో శ్రీ శ్రీ శ్రీ  శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మొదటి రోజు బాబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మ వారినీ ప్రత్యేకంగా అలంకరించి పూజ కార్యక్రమం నిర్వహించారు.