బాలా త్రిపుర సుందరీ దేవి అవతారంలో పోలమాంబ దర్శనం
- పోలమాంబ ఆలయంలో అంగరంగ వైభవంగా సరన్నవరాత్రి వేడుకలు
మక్కువ, సూర్య: రాష్ట్ర గిరిజన జాతరగా గుర్తింపు పొందిన ఉత్తరాంధ్ర ఇలవేల్పు శంబర శ్రీ పోలమాంబ అమ్మవారి ఆలయంలో శరన్నవరాత్రి వేడుకలు ఆదివారం నాడు అంగరంగ వైభవంగా ప్రారంభమైనాయి. స్వస్తిశ్రీ పరాభవ నామ సంవత్సరం ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి ఆదివారం ఉదయం 9:30 గంటలకు "శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి" అవతారంలో శ్రీ పోలమాంబ అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. ఈ ఉత్సవంలో భాగంగా శ్రీ పోలమాంబ అమ్మవారి ఉత్సవ మూర్తిని ప్రధాన పీఠం పై వేదమంత్రోచ్ఛారణ మధ్య భక్తులు ప్రత్యేక పూజలు సమర్పించగా వేంచేసియున్నారు. ముందుగా గణపతి పూజ, పుణ్యాహవాచనం పరిషత్, పంచగవ్యం, కలశ స్థాపన, దీపస్థాపన, దీక్షాధారణ, దీక్ష సంకల్పం, రుత్విక్ వరుణ, అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమంలు నిర్వహించారు. తదుపరి విశేష హోమములు వేద ఆశీర్వచనం జరిగినవి. పై కార్యక్రమంలను ఆలయ కార్యనిర్వహణ అధికారి వి.వి. సూర్యనారాయణ పర్యవేక్షణలో అత్యంత వైభవంగా నిర్వహించారు. పూజా కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ నైదాన చినతిరుపతి, గ్రామ పెద్దలు తీళ్ల పోలినాయుడు, పూడి దాలినాయుడు, గంజి కాశి నాయుడు,అల్లు వెంకటరమణ,గొట్టాపు కృష్ణమూర్తి, ధర్మకర్తల మండలి సభ్యులు గొట్టాపు భవాని, గ్రంధి గున్నరాజు, వడగళ్ల వేణు గోపాలనాయుడులతో పాటు ఆలయ ఆశాధిలు జన్నిపేకాపు భాస్కరరావు తో సహా అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. పూజ అనంతరం భక్తులతో అమ్మవారి ప్రసాదాలు అందజేశారు. భక్తులకు ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా ముందు జాగ్రత్తగా క్యూ లైన్లు, బారికేడ్లు, మంచినీటి సదుపాయంలు ఆలయ కార్యనిర్వాహణాధికారి వి.వి. సూర్యనారాయణ గారు ఆదేశములు సూచనలు మేరకు సిబ్బంది మార్కొండ మురళీ కృష్ణ మూర్తి నాయుడు తదితరులు ఏర్పాటు చేసిరి.