ఘనంగా ప్రారంభమైన దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు
- గరుగుబిల్లి శ్రీషిరిడి సాయిబాబా ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు
- రావివలస శ్రీసంతోషిమాత ఆలయంలో ప్రారంభమైన శరన్నవరాత్రి ఉత్సవాలు
గరుగుబిల్లి, సూర్య: మండల పరిధిలోని ఆయా గ్రామాలలో ఆదివారం శ్రీదుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.శ్రీదుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం సందర్భంగా మేళ తాళాలతో ఊరే గింపుగా తరలించి అమ్మవారి విగ్రహాల ను ప్రతిష్టించారు.విజ్ఞేశ్వరపూజ, కలశస్థాపన,పుణ్యాహవాచనం, మండపారాధన, అంకురారోపణ,దీక్షా కంకణ ధారణ తదితర పూజా కార్యక్ర మాలను రుత్వికులు ఆధ్వర్యంలో నిర్వహించారు.అనంతరం శ్రీ దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగముగా అమ్మవారి విగ్రహాలను ప్రతిష్టించారు. గరుగుబిల్లి మండల కేంద్రంలోని శ్రీ షిరిడి సాయిబాబా ఆలయంలో శ్రీ దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా అమ్మవారి విగ్రహమును ఆదివారం ప్రతిష్టించారు.మండల పరిధిలోని రావివలస గ్రామంలోని శ్రీసంతోషిమాత,జ్ఞానసరస్వతిమాత ఆలయ ప్రాంగణంలో శ్రీసంతోషిమాత ఆలయ ప్రధాన అర్చకులు తామరపల్లి వెంకటలక్ష్మినరసింహమూర్తిశర్మ ఆధ్వర్యంలో అమ్మవారి విగ్రహమును ప్రతిష్టించారు.అదే విధంగా మండల పరిధిలోని గిజబ, పెద్దూరు, రావుపల్లి, శివ్వాము, తదితర గ్రామాల్లో శ్రీదుర్గా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.శ్రీదుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని పూజా కార్యక్రమాలను నిర్వహించారు.