లయన్స్ క్లబ్ సౌజన్యంతో విజ్ఞాన భారతిలో మొక్కలు నాటే కార్యక్రమం..
నరసన్నపేట పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంపొందించడమే లక్ష్యంగా నరసన్నపేటలోని విజ్ఞాన భారతి పాఠశాల ఆవరణలో లయన్స్ క్లబ్ నరసన్నపేట మిలీనియం, క్వీన్ లయన్స్ నరసన్నపేట సంయుక్త ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా లయన్స్ క్లబ్ గవర్నర్ లయన్ సుబ్బరాజు, పూర్వ డిస్ట్రిక్ట్ గవర్నర్ (పీడీజీ) లయన్ వర్మ, జోన్ కోఆర్డినేటర్ (జెడ్‌సీ) లయన్ హారిక ప్రసాద్, రీజియన్ కోఆర్డినేటర్ (ఆర్‌సీ) లయన్ రమణ సాహు హాజరై పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు.ఈ సందర్భంగా పాఠశాల ప్రబంధకారిణి కమిటీ అధ్యక్షుడు నానాజీ గాడ్గే మాట్లాడుతూ పర్యావరణ సమతుల్యతను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడంతో పాటు వాటిని బాధ్యతగా సంరక్షించాలని పిలుపునిచ్చారు. పర్యావరణ పరిరక్షణ కోసం లయన్స్ క్లబ్ చేపడుతున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని పేర్కొన్నారు.
కార్యక్రమంలో లయన్స్ క్లబ్ నరసన్నపేట మిలీనియం అధ్యక్షుడు లయన్ పాగోటి రాజారావు, కార్యదర్శి లయన్ శిల్ల శ్రీనివాస్, కోశాధికారి లయన్ కోరాడ హేమంత్ కుమార్, క్వీన్ లయన్స్ నరసన్నపేట అధ్యక్షురాలు లయన్ తంగుడు జ్వాల, కార్యదర్శి లయన్ వారణాసి ఆశాలత, లయన్ పొట్నూరు రమేష్‌తో పాటు క్లబ్ సభ్యులు, పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.