BREAKING
సోషల్ మీడియా పోస్టులపై పోలీసులు హెచ్చరిక. కేంద్ర మంత్రి కృషితో అత్తిలిలో అత్యాధునిక డయాలసిస్ కేంద్రం -- ఎన్‌ఎండీసీ నుంచి రూ.75 లక్షల సీఎస్‌ఆర్ నిధులతో 7 అత్యాధునిక డయాలసిస్ మిషన్లు శ్రీమహమ్మారమ్మ ఆలయంలో ప్రారంభమైన శరన్నవరాత్రి వేడుకలు కొమరగిరిపట్నం శివారు దైవాలపాలెంలో వాటర్ ట్యాంక్ నిర్మాణానికి శంకుస్థాపన: ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు! బీసీలకు ఎక్కువ శాతం సీట్లు కేటాయింపు నిర్ణయం పట్ల జగదీశ్వరి హర్షం సీతారాంపల్లి గ్రామం పాడిపంటలతో సుభిక్షంగా వర్ధిల్లాలి వి.హెచ్.పి సిద్ధాంతాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలి పుష్కరాల పనులకు శంకుస్థాపనలు * రూ.4.02కోట్లతో రహదారుల అభివృద్ది :వాసంశెట్టి సత్యం మృతుల కుటుంబాలకు కంచి పరమేశ్వర రెడ్డి ఆర్ధిక సాయం వృద్ధురాలు అదృశ్యం.. ఆచూకీ తెలిస్తే సమాచారం ఇవ్వండి షాద్ నగర్ లో రోడ్డు ప్రమాదం... వ్యక్తి దుర్మరణం అవయవదానానికి సమ్మతించిన టీడీపీ నేత మాధవరావు 1982 నుంచి తెలుగుదేశం పార్టీకి అంకితభావంతో ఘన గౌరవం శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం బిజెపిలో బలమైన బీసీ నేత జబ్బల శ్రీనివాసులు

ఆలయాన్ని సందర్శించిన పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ మాధవానంద సరస్వతి స్వామి. * చారిత్రక సంపదను కాపాడుకోవడం భక్తుల బాధ్యత

Select Suryaa Now
ఆలయాన్ని సందర్శించిన పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ మాధవానంద సరస్వతి స్వామి. * చారిత్రక సంపదను కాపాడుకోవడం భక్తుల బాధ్యత



కొండపాక :ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన దుద్దెడ శ్రీ స్వయంభూ శంభులింగేశ్వర స్వామి దేవాలయాన్ని శ్రీ గురు మదనానంద సరస్వతి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ మాధవానంద సరస్వతి స్వామి ఆదివారం దర్శించుకున్నారు. ఇటీవల కురిసిన  వర్షాలకు ఆలయ కోనేరు ఉత్తర భాగం గోడ కూలి శిథిలావస్థకు చేరిన నేపథ్యంలో, కోనేరు పునరుద్ధరణ పనులపై క్షేత్రస్థాయి పరిశీలన జరిపి భక్తులకు, ట్రస్టు సభ్యులకు మార్గదర్శనం చేశారు.

ప్రత్యేక పూజలతో ఆధ్యాత్మిక శోభ

ఆలయానికి విచ్చేసిన పూజ్య పీఠాధిపతులకు శ్రీ స్వయంభూ శంభులింగేశ్వర సేవా సమితి ట్రస్టు ప్రతినిధులు, గ్రామ ప్రముఖులు ఘన స్వాగతం పలికారు. తొలుత స్వామీజీ స్వయంభూ శంభులింగేశ్వరునికి, దక్షిణాభిముఖిగా వెలసిన భవానీ మాతకు, శ్రీ వీరభద్ర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామస్తులు, అర్చకులతో కలిసి కూలిపోయిన కోనేరు భాగాన్ని పరిశీలించి, స్థానికుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు.

ఆగమ శాస్త్రోక్తంగా పునర్నిర్మాణం : స్వామీజీ దిశానిర్దేశం

ఈ సందర్భంగా స్వామీజీ మాట్లాడుతూ, చారిత్రక ప్రాశస్త్యం కలిగిన కోనేరును ఎట్టి పరిస్థితుల్లోనూ పూడ్చివేయరాదని స్పష్టం చేశారు. ఆలయ పవిత్రత, ప్రాచీన వైభవం దెబ్బతినకుండా ఆగమ, వాస్తు శాస్త్రాల ప్రకారం పునర్నిర్మాణం చేపట్టాలని సూచించారు. శాస్త్రోక్తంగా కళావరోహణ పూజా కార్యక్రమం పూర్తి చేసిన తర్వాతే పునర్నిర్మాణ పనులను ప్రారంభించాలనీ, ప్రస్తుతం ఉన్న లోతు, పొడవు, వెడల్పుల నిష్పత్తిని అలాగే కొనసాగించి పాత రాళ్లను తొలగించి, అవసరమైన కొత్త రాళ్లను సమకూరుస్తూ పటిష్టమైన నిర్మాణం చేపట్టాలనీ తెలిపారు. భవిష్యత్తులో ప్రమాదాలు జరగకుండా మధ్యలో 12 × 12 అడుగుల విస్తీర్ణంలో బావి భాగాన్ని వదిలి, చుట్టూ రక్షణ గోడ (ఆర్సీసీ), పైన స్లాబ్ వేసి చెత్తాచెదారం పడకుండా బావిపై దృఢమైన జాలీని ఏర్పాటు చేయాలని, కోనేరుకు నాలుగు వైపులా ప్రవేశ ద్వారాలు, 6 అడుగుల గోడ, 5 అడుగుల మేర మెట్లు నిర్మించి, నీరు ఎక్కడా నిల్వ ఉండకుండా, ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఇంజనీరింగ్ పద్ధతులను అనుసరించాలన్నారు. శిల్పులతో సప్తమాతృకల ఫ్రేముపై ఉన్న రంగును తొలగించి, బఫరింగ్ చేయించి సహజత్వాన్ని కాపాడాలని పేర్కోన్నారు. కోనేరు సమీపంలో ఉన్న పురాతన రావి వృక్షం వల్ల నిర్మాణానికి పగుళ్లు రాకుండా శాస్త్రోక్తంగా 'దోహన క్రియ' నిర్వహించి దీపావళి పండుగ లోపు నిపుణులైన స్థపతులు, ఇంజనీర్ల ద్వారా సమగ్ర నిర్మాణ ప్లాన్ సిద్ధం చేసుకోవాలని, పనులకు అంకురార్పణ చేయాలని స్వామీజీ సూచించారు. గ్రామస్తులు, స్థానిక నాయకులు, భక్తులు కలిసికట్టుగా నిర్ణయాలు తీసుకుంటూ త్వరితగతిన పనులు పూర్తి చేయాలన్నారు. ఈ బృహత్ పుణ్యకార్యానికి దాతలు, గ్రామస్తులందరూ విరాళాలు అందించి భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో శ్రీ స్వయంభూ శంభులింగేశ్వర సేవా సమితి ట్రస్ట్ చైర్మన్ మంచాల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి అనంతుల నరేందర్, ప్రతినిధులు వడ్లకొండ శ్రీనివాస్, పెద్ది కుమారస్వామి, అమిరిశెట్టి వెంకటేశం,ఆరెపల్లి మహాదేవు గౌడ్, మంచాల చిన్న శ్రీనివాస్, గొల్లపల్లి రఘురామ శర్మలతో పాటు పెద్ద సంఖ్యలో గ్రామస్తులు, భక్తులు పాల్గొన్నారు.