నర్సీపట్నం మున్సిపాలిటీలో పోలింగ్ కేంద్రాల పరిశీలన
భద్రతా ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించిన సిఐ గఫూర్. కమిషనర్ సురేంద్ర
నర్సీపట్నం, మేజర్ న్యూస్: నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధిలో ఎన్నికల నిర్వహణకు సంబంధించి అధికారులచే ధ్రువీకరించిన పోలింగ్ కేంద్రాలను నర్సీపట్నం టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఎస్.కె గఫూర్ , మున్సిపల్ కమిషనర్ జంపా సురేంద్ర తో కలిసి పోలింగ్ కేంద్రాలను పరిశీలన చేశారు.
ఈ సందర్భంగా సీఐ ఎస్.కె గఫూర్ సురేంద్ర మాట్లాడుతూ పోలింగ్ కేంద్రాల వద్ద కల్పించాల్సిన మౌలిక సదుపాయాలు, ఓటర్లకు అవసరమైన సౌకర్యాలు, ట్రాఫిక్ నియంత్రణ, పోలీసు బందోబస్తు ఏర్పాట్లు, శాంతిభద్రతల పరిరక్షణకు తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై సంబంధిత అధికారులతో చర్చించి, అవసరమైన ఏర్పాట్ల చేయాలని తెలిపారు.
పోలింగ్ కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అవసరమైన పోలీసు భద్రతా చర్యలు చేపట్టేందుకు. ఓటర్లు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంత వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు అవసరమైన ఏర్పాట్లను సిద్ధం చేశారు .
ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా పోలీసు, మున్సిపల్ మరియు ఇతర సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ, ముందస్తు భద్రతా చర్యలను పటిష్టంగా అమలు చేసేలా అవసరమైన అన్ని ఏర్పాట్లను చేసినట్లు సర్కిల్ ఇన్స్పెక్టర్ గఫూర్ కమిషనర్ సురేంద్ర తెలిపారు.