శివాలయంలో శరన్నవరాత్రుల ప్రారంభం
సాలూరు సూర్య: ప్రతీ ఏటా శివాలయంలో వేద పండితులచే శాస్త్రోక్తంగా ఈ తొమ్మిది రోజులు శరన్నవరాత్రుల ఉత్సవాలను జరిపిస్తారు. అందులో భాగంగా ఆదివారం ఉదయం సుబ్బ పంతులు అధ్వర్యంలో పంచముఖేశ్వర ఆలయ ఆవరణలో మొదటిరోజు బాలాత్రిపుర సుందరి దేవి అమ్మవారిని ప్రతిష్టించారు. అనంతరం ఆ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తొలిరోజు నిర్వహిస్తున్న బాలాత్రిపుర సుందరి దేవి అమ్మవారిని దర్శించుకోవడానికి అలాగే ఈ తొమ్మిది రోజులు అమ్మవారి మాల వేసుకున్న భక్తులు హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ శరన్నవరాత్రుల తొమ్మిది రోజులు ఉదయం వేళల్లో వేద పండితులు చేత లలితా హోమాలు నిర్వహిస్తారు. ఆలయంలో ఈ తొమ్మిది రోజులు సాయంత్రం వేళలో అమ్మవార్లకు గుడి చుట్టూ తిరువీధి నిర్వహించిన పిదప కోనేటిలో తెప్పోత్సవం నిర్వహిస్తారు.అమ్మవారి తెప్పోత్సవం కనులారా చూసి తరించడానికి చుట్టు పక్కల నుండి విశేషంగా బక్తులు హాజరు అవుతారు.