శంకర్ పల్లిలోని విఠలేశ్వర ఆలయంలో ఘనంగా నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం
జై భవాని యూత్ ఆధ్వర్యంలో.. 26 ఏళ్లుగా నవరాత్రి ఉత్సవాలు
శంకర్ పల్లి లోని విఠలేశ్వర ఆలయంలో ఆదివారం రోజున నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. జై భవాని యూత్ ఆధ్వర్యంలో నవరాత్రి ఉత్సవాలలో భాగంగా మొదటి రోజున అమ్మవారిని ప్రతిష్టించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. జై భవాని యూత్ అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ గత 26 సంవత్సరాలుగా శంకరపల్లి లో తమ యూత్ ఆధ్వర్యంలో నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నామని తెలిపారు.
శంకర్ పల్లి లోని భక్తులందరూ ఈ నవరాత్రి ఉత్సవాలలో పాల్గొని, అమ్మవారికి ఘనంగా పూజలు నిర్వహిస్తారని తెలిపారు. ఈ నవరాత్రి ఉత్సవాలలో అమ్మవారి భక్తులు అమ్మవారి దీక్ష తీసుకొని భక్తిశ్రద్ధలతో అమ్మవారిని పూజిస్తారని తెలిపారు.
మాడిశెట్టి రాజశేఖర్, మేజర్ న్యూస్ - శంకర్పల్లి