BREAKING
S V V స్కూల్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు నేటి రాశి ఫలాలు 13 అక్టోబర్ 2026 నేటి పంచాంగం 13 అక్టోబర్ 2026 అల్లర్లకు పాల్పడితే ఉపేక్షించేది లేదు యువతను మోసం చేసిన కాంగ్రెస్ కు పట్టభద్రులు బుద్ధి చెప్పాలి మండల అభివృద్ధిపై సర్వసభ్య సమావేశం దర్యాప్తులో జాప్యం వద్దు.. విధుల్లో అప్రమత్తంగా ఉండాలి జానేష్ కుమార్ ను విధుల నుండి తొలగించాలి చుక్కలు చూపిస్తున్న బుకింగ్స్: ఢిల్లీ చారిత్రక 'రామ్‌లీలా మైదానం'లో ఈ ఏడాది మిగిలింది కేవలం 3 రోజులే.. కారణాలు ఇవే! యూఎస్ ‘పెర్మ్’ నిలిపివేతతో మాపై ఎలాంటి ప్రభావం ఉండదు: తేల్చిచెప్పిన హెచ్‌సీఎల్‌టెక్.. కారణాలు ఇవే! సముద్రాలలో నిరుపేదలకే ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలి స్టార్‌లింక్ స్టేషన్ దగ్ధం కేసు...జర్మనీలో ఇద్దరు టర్కీ పౌరుల అరెస్ట్ సౌదీ అరేబియా వ్యూహాత్మక అడుగు: హార్ముజ్ జలసంధిపై ఆధారపడటం తగ్గించేలా.. పైప్‌లైన్ సామర్థ్యం 10 మిలియన్ బ్యారెళ్లకు పెంపు! విడుదల ముందే ఏఐ మోడళ్ల భద్రతా సమీక్ష: ట్రంప్ విధానాన్ని తిరస్కరిస్తూ యూకే ప్రభుత్వం కీలక నిర్ణయం! ఉత్తర ఇజ్రాయెల్‌లో పేలిన బాంబు

త్రివిధ దళాల మాజీ సైనికులతో బిజెపి రాష్ట్ర చీఫ్ సమావేశం..

Select Suryaa Now
త్రివిధ దళాల మాజీ సైనికులతో బిజెపి రాష్ట్ర చీఫ్ సమావేశం..

 

నరసన్నపేట అక్టోబర్ 11 మేజర్ న్యూస్: భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ ఆదివారం నరసన్నపేటలో పర్యటించారు. ఈ సందర్భంగా త్రివిధ దళాల మాజీ సైనికుల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు. సత్యవరం జంక్షన్ నుంచి పాత బస్టాండ్ వరకు బీజేపీ శ్రేణులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించాయి. మారుతీనగర్ జంక్షన్ వద్ద పార్టీ నాయకులు, కార్యకర్తలు గజమాలతో ఆయనకు ఘన స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా మాధవ్ మాట్లాడుతూ దేశ సమగ్రత, భద్రతను కాపాడటంలో సైనికుల పాత్ర ఎంతో కీలకమని కొనియాడారు. సైనికులు, మాజీ సైనికులు, వారి కుటుంబాల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం పలు చర్యలు చేపట్టిందని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిన వన్ ర్యాంక్ వన్ పెన్షన్ (ఓఆర్‌ఓపీ) విధానం ద్వారా మాజీ సైనికులకు ప్రయోజనం కల్పించామని పేర్కొన్నారు. సైనిక కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం అండగా నిలుస్తోందని చెప్పారు.

నరేంద్ర మోదీ పాలనలో దేశాభివృద్ధి కొనసాగుతోందని, ప్రభుత్వ విధానాలపై ప్రజల్లో సానుకూల స్పందన ఉందని మాధవ్ అన్నారు. మరోవైపు, మోదీ ప్రభుత్వంపై కొందరు చేస్తున్న విమర్శలను ఆయన తప్పుబట్టారు. ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద జరిగిన ఘటనను ప్రస్తావిస్తూ, కాంగ్రెస్, వామపక్షాలు సహా ఇతర రాజకీయ పార్టీలు సుప్రీంకోర్టు, ఎన్నికల సంఘం వంటి వ్యవస్థలపై చేస్తున్న ఆరోపణలను ఖండించారు.

ఓటు చోరీ పేరుతో రాజకీయ పార్టీలు చేస్తున్న ఆరోపణలపై స్పందిస్తూ, వాటి వెనుక రాజకీయ ఉద్దేశాలు ఉన్నాయని మాధవ్ విమర్శించారు. గత 25 ఏళ్లుగా దేశాభివృద్ధికి కృషి చేస్తున్న నరేంద్ర మోదీపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని ప్రజలు తిరస్కరించాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, త్రివిధ దళాల మాజీ సైనికులు పాల్గొన్నారు.