మినీ గురుకులాల సిబ్బందిని రెగ్యులర్ చేయాలి
పాచిపెంట, సూర్య: రాష్ట్రంలో 12 మినీ గురుకులాల లో విధులు నిర్వర్తిస్తున్న సిబ్బందిని తక్షణమే రెగ్యులర్ చేయాలని గురుకులాల జాతీయ అధ్యక్షుడు విద్యాసాగర్ కు వినతి పత్రాన్ని అందజేసినట్లు మినీ గురుకులాల రాష్ట్ర అధ్యక్షురాలు ఎస్ హేమలత తెలిపారు. గుంటూరులో నిర్వహించిన రాష్ట్ర మినీ గురుకులాల సిబ్బంది సమావేశంలో పాల్గొన్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా మినీ గురుకులాల రాష్ట్ర అధ్యక్షురాలు ఎస్ హేమలత స్థానిక విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలోని 12 మినీ గురుకులాలు ఉన్నాయని వాటిలో కాంట్రాక్ట్ మరియు ఔట్సోర్సింగ్ లలో పనిచేస్తున్నటువంటి సిబ్బందిని రాష్ట్ర ప్రభుత్వం రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి మినీ గురుకులాలను మరింత అభివృద్ధి పరిచే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.