BREAKING
సోషల్ మీడియా పోస్టులపై పోలీసులు హెచ్చరిక. కేంద్ర మంత్రి కృషితో అత్తిలిలో అత్యాధునిక డయాలసిస్ కేంద్రం -- ఎన్‌ఎండీసీ నుంచి రూ.75 లక్షల సీఎస్‌ఆర్ నిధులతో 7 అత్యాధునిక డయాలసిస్ మిషన్లు శ్రీమహమ్మారమ్మ ఆలయంలో ప్రారంభమైన శరన్నవరాత్రి వేడుకలు కొమరగిరిపట్నం శివారు దైవాలపాలెంలో వాటర్ ట్యాంక్ నిర్మాణానికి శంకుస్థాపన: ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు! బీసీలకు ఎక్కువ శాతం సీట్లు కేటాయింపు నిర్ణయం పట్ల జగదీశ్వరి హర్షం సీతారాంపల్లి గ్రామం పాడిపంటలతో సుభిక్షంగా వర్ధిల్లాలి వి.హెచ్.పి సిద్ధాంతాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలి పుష్కరాల పనులకు శంకుస్థాపనలు * రూ.4.02కోట్లతో రహదారుల అభివృద్ది :వాసంశెట్టి సత్యం మృతుల కుటుంబాలకు కంచి పరమేశ్వర రెడ్డి ఆర్ధిక సాయం వృద్ధురాలు అదృశ్యం.. ఆచూకీ తెలిస్తే సమాచారం ఇవ్వండి షాద్ నగర్ లో రోడ్డు ప్రమాదం... వ్యక్తి దుర్మరణం అవయవదానానికి సమ్మతించిన టీడీపీ నేత మాధవరావు 1982 నుంచి తెలుగుదేశం పార్టీకి అంకితభావంతో ఘన గౌరవం శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం బిజెపిలో బలమైన బీసీ నేత జబ్బల శ్రీనివాసులు

రైలు ఢీకొని 130 గొర్రెలు మృతి!

Select Suryaa Now
రైలు ఢీకొని 130 గొర్రెలు మృతి!

 

నందిగాంముగ్గురు గొర్రెల కాపర
లకు భారీ నష్టం.. శోకసంద్రంలో బాధిత కుటుం బాలు

పూండి: పలాస వైపు వెళ్తున్న రైలు ఢీకొని సుమారు 130 గొర్రెలు మృత్యువాత పడిన విషాద ఘటన వల్లభ రాయుడుపాడు రైల్వే గేటు సమీపంలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంతో గొర్రెల కాపరుల కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. గొర్రెలన్నీ మృతి చెందడంతో బాధితులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కాపరులు తెలిపిన వివరాల ప్రకారం.. దేవాడ గ్రామానికి చెందిన లండ తిరుపతి (40), వేణుగోపాలపురం గ్రామానికి చెందిన తొంప రామయ్య (50), దేవుపురం గ్రామానికి చెందిన సాలీనా చిన్నారావుకు50 చెందిన గొర్రెలు రైలు ప్రమాదానికి గురయ్యాయి. పలాస వైపు వెళ్తున్న రైలు ఢీకొనడంతో సుమారు 130 గొర్రెలు మృతి చెందినట్లు కాపరులు తెలిపారు. జీవనాధారాన్ని

కోల్పోయి కన్నీరుమున్నీరు గొర్రెల పెంపకాన్నే ప్రధాన జీవనాధారంగా చేసుకుని కుటుంబాలను పోషించుకుంటున్న బాధితులకు ఈ ఘటన తీరని నష్టాన్ని మిగిల్చింది. ఏళ్ల తరబడి గొర్రెల పెంప కంపై ఆధారపడి జీవనం సాగిస్తున్న కాపరులకు ఒక్కసారిగా ఇంతటి నష్టం వాటిల్లడంతో వారి కుటుంబాలు దిక్కుతోచని స్థితిలో పడ్డాయి. ప్రమాద స్థలంలో గొర్రెల కళేబరాలు చెల్లాచెదురు గా పడి ఉండటంతో అక్కడి పరిస్థితి హృదయ విదారకంగా మారింది. ప్రభుత్వం ఆదుకోవాలని బాధితుల వేడుకోలు రైలు ప్రమాదంలో సుమారు 130 గొర్రెలు మృతి చెందడంతో తీవ్రంగా నష్టపోయిన బాధిత గొర్రెల కాపరులను ప్రభుత్వం ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నా రు. సంబంధిత అధికారులు ఘటనపై విచారణ జరిపి, నష్టాన్ని అంచనా వేసి బాధితులకు తగిన పరిహారం అందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.