BREAKING
S V V స్కూల్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు నేటి రాశి ఫలాలు 13 అక్టోబర్ 2026 నేటి పంచాంగం 13 అక్టోబర్ 2026 అల్లర్లకు పాల్పడితే ఉపేక్షించేది లేదు యువతను మోసం చేసిన కాంగ్రెస్ కు పట్టభద్రులు బుద్ధి చెప్పాలి మండల అభివృద్ధిపై సర్వసభ్య సమావేశం దర్యాప్తులో జాప్యం వద్దు.. విధుల్లో అప్రమత్తంగా ఉండాలి జానేష్ కుమార్ ను విధుల నుండి తొలగించాలి చుక్కలు చూపిస్తున్న బుకింగ్స్: ఢిల్లీ చారిత్రక 'రామ్‌లీలా మైదానం'లో ఈ ఏడాది మిగిలింది కేవలం 3 రోజులే.. కారణాలు ఇవే! యూఎస్ ‘పెర్మ్’ నిలిపివేతతో మాపై ఎలాంటి ప్రభావం ఉండదు: తేల్చిచెప్పిన హెచ్‌సీఎల్‌టెక్.. కారణాలు ఇవే! సముద్రాలలో నిరుపేదలకే ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలి స్టార్‌లింక్ స్టేషన్ దగ్ధం కేసు...జర్మనీలో ఇద్దరు టర్కీ పౌరుల అరెస్ట్ సౌదీ అరేబియా వ్యూహాత్మక అడుగు: హార్ముజ్ జలసంధిపై ఆధారపడటం తగ్గించేలా.. పైప్‌లైన్ సామర్థ్యం 10 మిలియన్ బ్యారెళ్లకు పెంపు! విడుదల ముందే ఏఐ మోడళ్ల భద్రతా సమీక్ష: ట్రంప్ విధానాన్ని తిరస్కరిస్తూ యూకే ప్రభుత్వం కీలక నిర్ణయం! ఉత్తర ఇజ్రాయెల్‌లో పేలిన బాంబు

26వ వార్డులో రూ. 40 లక్షలతో కళ్యాణ మండపానికి శంకుస్థాపన

Select Suryaa Now
26వ వార్డులో రూ. 40 లక్షలతో కళ్యాణ మండపానికి శంకుస్థాపన

 ​ఎంపీ నిధులు కేటాయించిన రాజ్యసభ సభ్యులు చింతకాయల విజయ్

కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించిన చింతకాయల పద్మావతి
నర్సీపట్నం, మేజర్ న్యూస్ : గచ్చపు వీధి 26వ వార్డులో ఆదివారం నూతనంగా నిర్మించనున్న కళ్యాణ మండపానికి చింతకాయల పద్మావతి గారు కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు. ఈ భవన నిర్మాణానికి రాజ్యసభ సభ్యులు చింతకాయల విజయ్ తన ఎంపీ నిధుల నుంచి రూ. 40 లక్షలు కేటాయించారు. ఈ సందర్భంగా చింతకాయల పద్మావతి గారు మాట్లాడుతూ, ఈ కళ్యాణ మండపం అందుబాటులోకి వస్తే వార్డులోని పేద, మధ్యతరగతి ప్రజలకు ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. ఈ సందర్భంగా పద్మావతి గారు మాట్లాడుతూ.. గత ప్రభుత్వ హయాంలో వార్డులో ఎలాంటి అభివృద్ధి జరగలేదని, కానీ తమ ప్రభుత్వం వచ్చిన ఈ రెండేళ్లలోనే కోటీ పది లక్షల రూపాయలతో రోడ్లు, ఆసుపత్రి డ్రైనేజీ తదితర సమస్యలను పరిష్కరించామని గుర్తుచేశారు.   పేద, మధ్యతరగతి ప్రజల అవసరాల కోసం ఎంపీ విజయ్ గారు ఏకంగా 40 లక్షలు మంజూరు చేశారని ఆమె హర్షం వ్యక్తం చేశారు. ఈ నిధులతో స్టేజి, గదులు సహా సకల వసతులతో మండపాన్ని నిర్మిస్తామని, ప్రజలు కేవలం కనీస నిర్వహణ ఛార్జీలు చెల్లించి మున్సిపాలిటీ ఆధ్వర్యంలో దీనిని వినియోగించుకోవచ్చని వివరించారు. అభివృద్ధి చేసే నాయకులనే ప్రజలు ఎల్లప్పుడూ ఆదరించాలని ఆమె కోరారు. తమ వార్డు అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న శాసనసభ స్పీకర్  చింతకాయల అయ్యన్నపాత్రుడు గారికి, అలాగే భారీగా నిధులు మంజూరు చేసిన ఎంపీ విజయ్ గారికి ఈ సందర్భంగా వార్డు ప్రజలందరూ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.