బుధవారం నాడు జాబ్ మేళా
డిప్లమో మెకానికల్ & బి.ఇ బి.టెక్ మెకానికల్ విద్యార్థులకు ఉద్యోగ అవకాశం
జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
శ్రీకాకుళం,రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న 'స్వర్ణ గ్రామం - స్వర్ణ వార్డు'ల ఆధ్వర్యంలో 'కౌశలం' ద్వారా నిర్వహిస్తున్న ఉద్యోగ మేళాను జిల్లాలోని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పిలుపునిచ్చారు. ఈ నెల 14వ తేదీ (బుధవారం) శ్రీకాకుళం పట్టణంలోని జిల్లా ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో ఉదయం 9:00 గంటల నుంచి ఈ నియామకాల ప్రక్రియ ప్రారంభమవుతుందని ఆదివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలియజేశారు. ప్రముఖ ఇండో యంఐయం " సంస్థ ప్రతినిధులు హాజరై అర్హులైన అభ్యర్థులను ఎంపిక చేస్తారని, వార్షిక వేతనం రూ. 3,00,000 నుంచి రూ. 4,00,000 వరకు ఉంటుందని స్పష్టం చేశారు.
అర్హత కలిగిన కోర్సులు డిప్లొమా (మెకానికల్ ఇంజినీరింగ్ & బి.ఇ బి.టెక్ మెకానికల్) ట్రేడ్లు కలిగిన వారు అర్హులని తెలిపారు.
ఎటువంటి పూర్వ అనుభవం లేని వారు కూడా నియామక ప్రక్రియలో పాల్గొనవచ్చని పేర్కొన్నారు.ఎంపికైన అభ్యర్థులు తిరుపతి సమీపమున గల సదరు సంస్థలో పనిచేయవలసి ఉంటుందిని వెల్లడించారు.