అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఆర్థిక సహాయం అందించిన కాంగ్రెస్ నాయకులు తాటి బాలు
జీలుగుమిల్లి సూర్య న్యూస్: ములగలంపల్లి పాకల గూడెం గ్రామాలలో అనారోగ్యంతో బాధపడుతున్న పలువురికి కాంగ్రెస్ పార్టీ నాయకులు తాటి బాలరాజు ఆర్థిక సహాయం తో పాటు పళ్ళు ను అందించారు. ములగలం పల్లి గ్రామానికి చెందిన పేరా బత్తుల ధనలక్ష్మికి అనారోగ్యంతో ఉండడంతో పరామర్శించి పళ్ళును అందించారు. అలాగే షేక్ గుల్జార్ బ్రెయిన్ ట్యూమర్ తో బాధపడుతున్న వ్యక్తికి 3000 ఆర్థిక సహాయాలు అందజేశారు. పాకలగూడెం గ్రామానికి చెందిన గిరిజనుడు ధర్మల నాగరాజు కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న వ్యక్తిని పరామర్శించి ఆర్థిక సహాయం అందించారు. కాంగ్రెస్ పార్టీ అందరికీ అందుబాటులో ఉంటూ ప్రజలకు రక్షణ కోసం కృషిచేస్తుందని తాటి బాలు పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తామని ఆయన పేర్కొన్నారు వీరితోపాటు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
రిపోర్టర్ బొంతు రామకృష్ణ జీలుగుమిల్లి ఏలూరు జిల్లా,