ఓట్ల రాజకీయాల్లో ప్రజలే బలి - తెలంగాణ ప్రజా ఫ్రంట్ నేత ఎట్టి ప్రశాంత్ విమర్శ
ఓట్ల రాజకీయాల్లో ప్రజలే బలి
- తెలంగాణ ప్రజా ఫ్రంట్ నేత ఎట్టి ప్రశాంత్ విమర్శ
ఓట్ల రాజకీయాల్లో పాలకులు మారుతున్నా ప్రజల సమస్యలు పరిష్కారం కావడం లేదని తెలంగాణ ప్రజా ఫ్రంట్ ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎట్టి ప్రశాంత్ విమర్శించారు. శనివారం ఫ్రంట్ 17వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆయన ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ సాధన కోసం ప్రజలు చేసిన పోరాటాలు, త్యాగాలకు పాలకులు న్యాయం చేయలేదన్నారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం కుటుంబ పాలన, అవినీతి, నియంతృత్వ పోకడలతో ప్రజల ఆకాంక్షలను దెబ్బతీసిందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా గత పాలకుల తరహాలోనే వ్యవహరిస్తోందని ఆరోపించారు. మంత్రులు, ఎమ్మెల్యేలకు సైతం ముఖ్యమంత్రిని కలిసే అవకాశం లభించడం లేదని పేర్కొన్నారు. పాలక పార్టీల మధ్య పోరాటం అధికారం కోసమే తప్ప ప్రజల మౌలిక సమస్యల పరిష్కారం కోసం కాదని అన్నారు. రాజకీయ చైతన్యంతో కూడిన ప్రజా ఉద్యమాల ద్వారానే ప్రజాస్వామ్య తెలంగాణ సాధ్యమవుతుందని ఎట్టి ప్రశాంత్ పేర్కొన్నారు.
సూర్య ప్రతినిధి దస్రు టేకులపల్లి