BREAKING
వెల్దుర్తి సీహెచ్‌సీలో అక్టోబర్ 9న మెగా వైద్య శిబిరం: మెడికల్ ఆఫీసర్ డాక్టర్ బాలచంద్రారెడ్డి జగ్గయ్యపేట మున్సిపాలిటీ పై వైస్సార్ సీపీ జెండా ఎగరడం కాయం... పీటీ ఉష 42 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టిన అథ్లెట్ విత్య రామరాజ్ ను అభినందించిన హీరో ధనుష్! మోదీ 25 ఏళ్ల సుదీర్ఘ ప్రజా జీవితంపై ఏపీ కేబినెట్ కీలక తీర్మానం: చంద్రబాబు ప్రశంసలు సీఎం చంద్రబాబుతో మంత్రి నారాయణ భేటీ: రాజధాని భూములపై కీలక చర్చ విజయవాడలో పండుగల సందడి.. సరస్ మేళా, దసరా ఉత్సవాలు, విజయవాడ ఉత్సవ్‌తో నగరానికి కొత్త శోభ ఆసరా కోసం.. వృద్ధురాలి అవస్థలు! పంట పండించే రైతు లేకపోతే ప్రపంచానికే మనుగడలేదు. గొట్టిపాటి లక్ష్మి నాకు దేవుడు ఇచ్చిన గొప్ప వరం ఈ సినిమా.. 'గరివిడి లక్ష్మి' ట్రైలర్ వేడుకలో నటి ఆనంది భావోద్వేగం! ప్రజల ఆరోగ్య భద్రతకు అండగా ఎమ్మెల్యే బోడే ప్రసాద్ కళాశాలకు ఇన్వర్టర్ సిస్టం బహుకరణ చింతలపూడిలో చట్టాలపై అవగాహన సదస్సు ఉరవకొండ గురుకుల పాఠశాలలో కలెక్టర్‌ ఓ.ఆనంద్‌ తనిఖీ టి. నర్సాపురంలో పేద విద్యార్థులకు నోట్‌బుక్స్ పంపిణీ బ్రిడ్జి నిర్మాణ పనులు ప్రారంభం

మార్కెట్‌యార్డ్‌, రైతుబజార్‌ అభివృద్ధికి రూ.2.62 కోట్లు

Select Suryaa Now
మార్కెట్‌యార్డ్‌, రైతుబజార్‌ అభివృద్ధికి రూ.2.62 కోట్లు

వికారాబాద్, మేజర్ న్యూస్ :వికారాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ పరిధిలోని మార్కెట్‌యార్డ్‌, రైతుబజార్‌లో మౌలిక వసతుల అభివృద్ధికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ.2.62 కోట్లు మంజూరు చేసింది. వికారాబాద్ ఎమ్మెల్యే, తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రత్యేక చొరవతో వ్యవసాయ, సహకార శాఖ ఈ నిధులకు పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. 2026–27 ఆర్థిక సంవత్సరానికి వికారాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వద్ద అందుబాటులో ఉన్న నిధులతో ఈ అభివృద్ధి పనులు చేపట్టనున్నారు.మొత్తం రూ.262.25 లక్షలతో ఐదు ప్రధాన అభివృద్ధి పనులకు నిధులు కేటాయించారు. ఇందులో భాగంగా మార్కెట్ కమిటీ కార్యాలయ భవనం పక్కన రూ.175 లక్షల వ్యయంతో 16 వాణిజ్య దుకాణాలను నిర్మించనున్నారు. మార్కెట్‌యార్డ్‌లోని ఓపెన్ ప్లాట్‌ఫాంపై రూ.42 లక్షలతో 30×12 మీటర్ల కవర్డ్ ప్లాట్‌ఫాంను ఏర్పాటు చేయనున్నారు.అదేవిధంగా మార్కెట్‌యార్డ్‌లో రైతులు, వ్యాపారుల భద్రతను దృష్టిలో ఉంచుకుని రూ.25.25 లక్షలతో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయనున్నారు. మార్కెట్‌యార్డ్‌లో రూ.10 లక్షలతో, రైతుబజార్‌లో మరో రూ.10 లక్షలతో ఆర్వో వాటర్ ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నారు.ఈ అభివృద్ధి పనులు పూర్తయితే మార్కెట్‌యార్డ్‌, రైతుబజార్‌కు వచ్చే రైతులు, వ్యాపారులకు మెరుగైన మౌలిక వసతులు అందుబాటులోకి రానున్నాయి. మార్కెట్ కార్యకలాపాలకు మరింత సౌకర్యవంతమైన వాతావరణం కల్పించడంతో పాటు రైతులకు అవసరమైన సదుపాయాలను మెరుగుపరచడమే లక్ష్యంగా పనులు చేపడుతున్నట్లు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తెలిపారు.