కోదాడ నియోజకవర్గo లో పల్లె రహదారులకు మహార్దశ.జీవో ఆర్టీ నంబర్ 533 జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం.
కోదాడ (మేజర్ న్యూస్) ఎన్నుకున్న ప్రజల కోసం, నియోజకవర్గాల అభివృద్ధి కోసం ప్రజల మధ్య ఉన్న ,అమెరికాలో ఉన్న ఆగని అభివృద్ధి నిధులు ఆ దంపతులకే సాధ్యం. ఇప్పటికే గత రెండున్నర సంవత్సరాలుగా కోదాడ నియోజకవర్గంలో అనేక పల్లె రహదారులు డబుల్ రోడ్లతో జాతీయ రహదారులు తలపిస్తున్నాయి. వ్యక్తిగత పనుల మీద వారం క్రితం అమెరికా వెళ్లిన ఆగని వారి అభివృద్ధి దాహం. మిగిలిన
కోదాడ నియోజకవర్గంలో పలు రహదారుల అభివృద్ధికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి ఎమ్మెల్యే పద్మావతి రెడ్డిల కృషితో 52.50 కోట్ల భారీ నిధులను మంజూరు చేసింది. నియోజకవర్గంలోని నాలుగు ప్రధాన రహదారుల విస్తరణ, పటిష్టీకరణ పనులకు ప్రభుత్వం పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది.
ఈ మేరకు రాష్ట్ర రవాణా, రోడ్లు మరియు భవనాల శాఖ మంగళవారం జీవో ఆర్టీ నంబర్ 533ను జారీ చేసింది. 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ప్లాన్ ఎండీఆర్ నిధుల కింద మొత్తం రూ.52.50 కోట్లతో నాలుగు రహదారుల అభివృద్ధి పనులను చేపట్టేందుకు ప్రభుత్వం మంగళవారం ఆమోదం తెలిపింది.
మంజూరైన రహదారుల వివరాలు
పాత జాతీయ రహదారి9 హెచ్ నుంచి కొండాపురం వరకు 12.2 కిలోమీటర్ల మేర రహదారి విస్తరణ, పటిష్టీకరణకు 27 కోట్లు, బేతవోలు నుంచి ఆచార్యులగూడెం వరకు 5.6 కిలోమీటర్ల మేర రహదారి అభివృద్ధికి 13.50 కోట్లు మంజూరయ్యాయి.
అదేవిధంగా కోదాడ మండలంలోని పీడబ్ల్యూడీ రోడ్డు నుంచి కిష్టాపురం రోడ్డు వరకు 2 కిలోమీటర్ల మేర రహదారి విస్తరణకు రూ.4.50 కోట్లు, పీడబ్ల్యూడీ రోడ్డు నుంచి రామలక్ష్మీపురం వరకు 3.1 కిలోమీటర్ల మేర రహదారి అభివృద్ధికి రూ.7.50 కోట్లు మంజూరు చేశారు.
ఈ నాలుగు రహదారుల అభివృద్ధి పనులతో ఆయా గ్రామాల మధ్య రవాణా సౌకర్యాలు మరింత మెరుగుపడనున్నాయి. ముఖ్యంగా రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులను మార్కెట్లకు తరలించేందుకు, విద్యార్థులు విద్యాసంస్థలకు వెళ్లేందుకు, ప్రజలు వైద్య, ఇతర అవసరాల కోసం ప్రయాణించేందుకు సౌకర్యవంతంగా మారనున్నాయి.
నియోజకవర్గంలోని గ్రామీణ ప్రాంతాలకు మెరుగైన రహదారి సౌకర్యాలు కల్పించాలనే లక్ష్యంతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి ప్రభుత్వ స్థాయిలో కృషి ఫలించింది అని ప్రజల అభిప్రాయపడుతున్నారు.మంజూరైన రహదారి పనులకు సంబంధించి తదుపరి చర్యలు చేపట్టాలని రాష్ట్ర రోడ్లు మరియు భవనాల శాఖ చీఫ్ ఇంజనీర్ను ప్రభుత్వం ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
52.50 కోట్ల నిధుల మంజూరుపై హర్షం
కోదాడ నియోజకవర్గంలోని నాలుగు ప్రధాన రహదారుల అభివృద్ధికి రూ.52.50 కోట్ల నిధులు మంజూరు కావడంపై ఆయా మండలాల స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గ అభివృద్ధికి కృషి కి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతి రెడ్డిలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.