మురళీమోహన్కు కనకదుర్గమ్మ దర్శనం
ఇంద్రకీలాద్రి మేజర్ న్యూస్: సినీనటుడు మురళీమోహన్ శుక్రవారం సాయంత్రం ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యులు గూడపాటి వెంకట సరోజినీ దేవి, పద్మశేఖర్ దంపతులు ఆయనకు స్వాగతం పలికి అమ్మవారి దర్శనం కల్పించి, ప్రసాదం అందజేశారు. మురళీమోహన్తో పాటు సినీనటులు శ్రీనివాసరెడ్డి, రాజా రవీంద్ర తదితరులు అమ్మవారిని దర్శించుకున్నారు.