సమానత్వం , సోదర భావం బుద్దదమ్మ లక్ష్యం
ఏలూరు, మేజర్ న్యూస్ : ఏలూరు నగరం స్థానిక లేడీస్ క్లబ్ నందు బుద్దిస్ట్ అకాడమీ ఆఫ్ తెలుగు సొసైటీ ఆధ్వర్యంలో బోధిసత్వ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ బౌద్ధదమ్మ దీక్ష తీసుకుని 70 సంవత్సరాలు అయిన సందర్భంగా స్థానిక క్లబ్ నందు చైర్మన్ డాక్టర్ మెండెం సంతోష్ కుమార్ అధ్యక్షతన కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా డాక్టర్ ఎన్ ఏడి పాల్ హాజరయ్యారు. డాక్టర్ సంతోష్ అధ్యక్ష ఉపన్యాసం చేస్తూ ఈ దేశంలో మనిషికి మతం అవసరమే ఆ మతం స్వేచ్ఛ, సమానత్వం , సోదర భావన ఉండాలన్నారు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ భావించిన విధంగా ప్రతి ఒక్కరు బౌద్ధం చెప్పిన విధంగా సమ సమాజ నిర్మాణం కోసం కృషి చేయాలన్నారు. డాక్టర్ ఎన్ఏడి పాల్ మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ స్వేచ్ఛ సమానత్వం అనేది బౌద్ధ సిద్ధాంతాల మీద తీసుకున్నది తప్ప ఫ్రెంచ్ విప్లవం నుండి కాదని అన్నారు కార్యక్రమంలో శ్రీధర్ సాయిబాబా జీ. వెంకటేశ్వరరావు జి. మోక్షానందం నాగేశ్వరావు , దాసరి నాగేంద్ర పాక ప్రభాకర్ , తదితరులు హాజరయ్యారు.