కరెంట్ షార్ట్‌సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధం.. బాధిత కుటుంబానికి కంజర్ల ఫౌండేషన్ అండ
యాలాల, మేజర్ న్యూస్ (అక్టోబర్ 13): విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ కారణంగా ఇల్లు పూర్తిగా దగ్ధమై కష్టాల్లో కూరుకుపోయిన నిరుపేద కుటుంబానికి కంజర్ల విజయలక్ష్మి ఫౌండేషన్ అండగా నిలిచింది. యాలాల మండలం రాస్నం గ్రామానికి చెందిన కుమ్మరి బుచ్చమ్మ ఇంట్లో జరిగిన అగ్నిప్రమాదంలో నిత్యావసర వస్తువులతో పాటు కష్టపడి దాచుకున్న నగదు సైతం కాలిబూడిదైంది. దీంతో బాధిత కుటుంబం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది.ఈ ఘటనపై ‘సూర్య’ దినపత్రికలో వచ్చిన కథనానికి స్పందించిన కంజర్ల విజయలక్ష్మి ఫౌండేషన్ ఛైర్‌పర్సన్ కంజర్ల విజయలక్ష్మి యాదవ్ బాధిత కుటుంబానికి సహాయం అందించేందుకు ముందుకొచ్చారు. ఫౌండేషన్ ప్రతినిధులు రాస్నం గ్రామానికి చేరుకుని బుచ్చమ్మ కుటుంబాన్ని పరామర్శించారు. వారికి నిత్యావసర వస్తువులను అందజేసి మనోధైర్యాన్ని కల్పించారు.ఈ సందర్భంగా ఫౌండేషన్ ప్రతినిధులు, మాజీ జిల్లా కో-ఆప్షన్ అధ్యక్షుడు అక్బర్ బాబా, ప్రకాష్ గౌడ్ మాట్లాడుతూ.. ఆపదలో ఉన్న నిరుపేద కుటుంబాలను ఆదుకోవడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని పేర్కొన్నారు. అగ్నిప్రమాదంతో సర్వం కోల్పోయిన బాధిత కుటుంబానికి తమ ఫౌండేషన్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, భవిష్యత్తులోనూ అవసరమైన సహాయం అందించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. బాధిత కుటుంబానికి అండగా నిలిచిన ఫౌండేషన్ ప్రతినిధుల సేవలను స్థానికులు అభినందించారు.ఈ కార్యక్రమంలో రాస్నం గ్రామ యువకులు బాబు, మధు గౌడ్‌తో పాటు పలువురు పాల్గొన్నారు.
రిపోర్టర్: ప్రకాష్ గౌడ్, యాలాల, వికారాబాద్ జిల్లా.