రాయల్ నగరంలో ఘర్షణ.. తెదేపా కార్యకర్తలపై దాడి కలకలం!
రాయల్ నగరంలో ఘర్షణ.. తెదేపా కార్యకర్తలపై దాడి కలకలం!
అనంతపురం.అనంతపురం నగరంలోని నారాయణపురం పంచాయతీ పరిధి రాయల్ నగరంలో తెదేపా కార్యకర్తలపై దాడి జరిగినట్లు ఆరోపణలు రావడం కలకలం రేపింది. వైకాపాకు చెందిన శ్రీహరికుమార్‌తో పాటు సుమారు ఇరవై మంది తమపై దాడి చేశారని బాధితులు ఆరోపించారు.ఈ ఘటనలో పలువురు కార్యకర్తలకు రక్తగాయాలైనట్లు సమాచారం. తమ కుటుంబాలకు ప్రాణహాని ఉందని ఆందోళన వ్యక్తం చేసిన బాధితులు, రక్షణ కల్పించి, దాడికి పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.
ఎన్నికల వేళ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించాలని స్థానికులు కోరుతున్నారు. ఈ ఘటనపై పోలీసుల చర్యలు ఎలా ఉంటాయన్నది వేచి చూడాలి.