కాకిలేరు పోలింగ్ బూత్ లు తనిఖీ చేసిన డీ ఎస్ పి నర్సింహమూర్తి
*ఇరగవరం సూర్య న్యూస్:* తాడేపల్లిగూడెం డీ.ఎస్.పి నర్సింహామూర్తి మండలంలోని కాకిలేరులో స్థానిక ఎన్నికలకు అవసరమైన ఏర్పాట్లు,పోలింగ్ బూత్ ల ఎంపిక, లెక్కింపు కార్యక్రమాలు తదితర అంశాలపై అధికారులతో చర్చించారు.స్థానిక ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఎన్నికల్లో అల్లరి మూకల కార్యకలాపాలు గుర్తించి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.అధికారుల ఎన్నికల నియామవాళి పాటించి సక్రమంగా జరిగేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కోరారు. కార్యక్రమంలో ఇరగవరం సబ్ ఇన్స్పెక్టర్ మహ్మద్ నసిరుల్లా, సిబ్బంది పాల్గొన్నారు.
దాయం దొరబాబు, రిపోర్టర్, ఇరగవరం పశ్చిమ గోదావరి జిల్లా