పేదల హక్కుల కోసం జీవితాంతం పోరాడిన యోధుడు గుండా మల్లేష్ కామ్రేడ్ గుండా మల్లేష్‌కు సీపీఐ నాయకుల ఘన నివాళులు
సూర్య, మంచిర్యాల టౌన్:పేద ప్రజల సంక్షేమం, బడుగు బలహీన వర్గాల హక్కుల సాధన కోసం నిరంతరం పోరాడిన పోరాట యోధుడు కామ్రేడ్ గుండా మల్లేష్ అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కలవేన శంకర్ కొనియాడారు. మంచిర్యాలలోని సీపీఐ కార్యాలయంలో గుండా మల్లేష్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా కలవేన శంకర్ మాట్లాడుతూ, బూటకపు ఎన్‌కౌంటర్లకు వ్యతిరేకంగా, ప్రజా సమస్యల పరిష్కారం కోసం గుండా మల్లేష్ నిరంతరం పోరాటాలు చేశారని తెలిపారు. పేదలు, బలహీన వర్గాల హక్కుల పరిరక్షణకు నిస్వార్థంగా కృషి చేశారని పేర్కొన్నారు. ప్రభుత్వాల దృష్టికి ప్రజా సమస్యలను తీసుకెళ్లడంతోపాటు, అన్యాయాలకు వ్యతిరేకంగా ధైర్యంగా గళమెత్తిన నాయకుడని కొనియాడారు.ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్, జిల్లా కార్యవర్గ సభ్యులు మేకల దాసు, కలిందర్ అలీ ఖాన్, రేగుంట చంద్రశేఖర్, జోగుల మల్లయ్య, మిట్టపల్లి పౌలు, దేవి పోచన్న, చాడ మహేందర్ రెడ్డి, మొగిలి లక్ష్మణ్, ప్రజాసంఘాల నాయకులు బియ్యాల రాజేశం, మండ యాదగిరి, సిరికొండ రాయమల్లు, కొడి వెంకటేష్, అచ్చ హరిష్ తదితరులు పాల్గొన్నారు.