BREAKING
స్థానిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయానికి నంద్యాల న్యాయవాదులు కృషి చేయాలి: నంద్యాల జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ మౌలిక వసతుల కల్పనే లక్ష్యంగా పనిచేస్తా: సర్పంచ్ సర్వీసు రోడ్డు నిర్మాణం చేపట్టాలని కోరుతూ గ్రామస్తులు జాతీయ రహదారి 563పై ధర్నా నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలో మెగా రక్తదాన శిబిరం తణుకు నియోజకవర్గంలో 154 ఇళ్లకు మంజూరు.. మరో 1,029 ఇళ్లకు ప్రతిపాదనలు రోడ్డు మరమ్మతులు ప్రారంభం. సౌర విద్యుత్‌లో జిల్లా అగ్రస్థానంలో తణుకు 2,110 కుటుంబాలకు లబ్ధి.. 6.7 మెగావాట్ల సౌర విద్యుత్ సామర్థ్యం రూ.17 కోట్ల మేర ఆర్థిక ప్రయోజనం పర్యావరణ పరిరక్షణకు సౌరశక్తే ప్రత్యామ్నాయం: ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ నిషార్ అహమ్మద్ కుటుంబాన్ని పరామర్శించిన నంద్యాల జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ నిషార్ అహమ్మద్ కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే శిల్పా రవి రూ.6 కోట్లు సీసీ రోడ్ల పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డి 18 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం పట్టివేత స్థానిక సంస్థల ఎన్నికలు సజావుగా నిర్వహించాలి పిల్లలతో డీ ఎస్ పి నర్సింహమూర్తి ఆత్మీయ పలకరింపు పవన్ కళ్యాణ్ కి కొట్టే సాయి ప్రసాద్ కృతజ్ఞతలు మొయినాబాద్ చౌరస్తాలో ఫ్లెక్సీలు, బోర్డుల తొలగింపు

హకీంపేటలో భారీ వ్యవసాయ మేళాకు సన్నాహాలు.. స్థలాన్ని పరిశీలించిన సురేంద్ర మోహన్, గోపి ఐఏఎస్‌లు, కలెక్టర్ దీపక్ తివారి

Select Suryaa Now
హకీంపేటలో భారీ వ్యవసాయ మేళాకు సన్నాహాలు.. స్థలాన్ని పరిశీలించిన సురేంద్ర మోహన్, గోపి ఐఏఎస్‌లు, కలెక్టర్ దీపక్ తివారి

దుద్యాల, మేజర్ న్యూస్ (అక్టోబర్ 13): రైతులకు ఆధునిక వ్యవసాయ పద్ధతులు, నూతన సాంకేతిక పరిజ్ఞానం, వ్యవసాయ యంత్రాల వినియోగంపై అవగాహన కల్పించేందుకు దుద్యాల మండల పరిధిలోని హకీంపేటలో భారీ వ్యవసాయ మేళా నిర్వహించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ మేళాకు సుమారు 50 వేల మంది రైతులను భాగస్వాములను చేయడంతో పాటు, వివిధ వ్యవసాయ సంస్థలకు చెందిన దాదాపు 200 స్టాళ్లను ఏర్పాటు చేయాలని ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం అగ్రికల్చర్ ప్లానింగ్ కమిషన్ సెక్రటరీ సురేంద్ర మోహన్ ఐఏఎస్, డైరెక్టర్ గోపి ఐఏఎస్, జిల్లా కలెక్టర్ దీపక్ తివారితో కలిసి హకీంపేటలోని ఎడ్యుకేషన్ హబ్ పరిసర ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.వ్యవసాయ మేళా నిర్వహణకు అనువైన స్థలాన్ని గుర్తించడంతో పాటు, వేలాది మంది రైతులు హాజరయ్యే నేపథ్యంలో వారికి అవసరమైన సౌకర్యాలు కల్పించే అంశంపై అధికారులు చర్చించారు. మేళా నిర్వహణకు ఎంత విస్తీర్ణంలో స్థలం అవసరమవుతుంది, వ్యవసాయ సంస్థల స్టాళ్లను ఎక్కడ ఏర్పాటు చేయాలి, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎలాంటి ఏర్పాట్లు చేపట్టాలనే విషయాలను పరిశీలించారు. జిల్లా కలెక్టర్ దీపక్ తివారితో కలిసి అధికారులు ప్రాంగణాన్ని పరిశీలించి, మేళా నిర్వహణకు అనువైన ప్రాంతాలపై సమీక్షించారు.ఈ వ్యవసాయ మేళాలో వివిధ రకాల వ్యవసాయ ఉత్పత్తులు, ఆధునిక వ్యవసాయ యంత్రాలు, నూతన సాగు పద్ధతులను ప్రదర్శించనున్నారు. వ్యవసాయ రంగంలో వస్తున్న సాంకేతిక మార్పులు, యంత్రాల వినియోగం, తక్కువ ఖర్చుతో మెరుగైన దిగుబడులు సాధించే పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించనున్నారు. సుమారు 200 స్టాళ్ల ద్వారా వివిధ వ్యవసాయ సంస్థలు తమ ఉత్పత్తులు, పరికరాలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులకు పరిచయం చేసే అవకాశం ఉంది.వ్యవసాయ రంగంలో ఆధునిక పద్ధతులను ప్రోత్సహించడం, రైతులకు నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని చేరువ చేయడం, వ్యవసాయ ఉత్పత్తులపై అవగాహన పెంపొందించడం ఈ మేళా ప్రధాన ఉద్దేశంగా భావిస్తున్నారు. సుమారు 50 వేల మంది రైతులు పాల్గొనేలా ప్రణాళికలు రూపొందిస్తున్న నేపథ్యంలో తాగునీరు, రాకపోకలు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించేందుకు అధికారులు ఏర్పాట్లు చేయనున్నారు.వ్యవసాయ మేళా నిర్వహణ తేదీని అధికారులు ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. దసరా పండుగ అనంతరం మేళా నిర్వహించే అవకాశం ఉన్నట్లు సమాచారం. స్థల పరిశీలన, ఏర్పాట్లపై సమీక్ష పూర్తయిన తర్వాత మేళా నిర్వహణకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.ఈ పరిశీలనలో వ్యవసాయ శాఖ అదనపు సంచాలకుడు విజయకుమార్, జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా, వికారాబాద్ జిల్లా వ్యవసాయ అధికారి కవిత, నారాయణపేట జిల్లా వ్యవసాయ అధికారి సక్రియ నాయక్, కడా ప్రత్యేక అధికారి వెంకట్ రెడ్డి, ట్రైనీ కలెక్టర్ సచిన్ బస్వరాజ్, పరిగి డీఎస్పీ శ్రీనివాస్, కొడంగల్ సీఐ చంద్రశేఖర్, స్థానిక ఎస్సై శ్రీశైలం, వ్యవసాయ శాఖ విస్తరణ అధికారులు సంతోష్ రాథోడ్, బాబు తదితరులు పాల్గొన్నారు.

రిపోర్టర్: రమేష్, దుద్యాల్, వికారాబాద్ జిల్లా.