BREAKING
రాష్ట్రస్థాయి ఖోఖో క్రీడాకారులకు ప్రోత్సాహం-బియ్యం బస్తా, పండ్ల పంపిణీ-యువజన కాంగ్రెస్ నాయకుడు కడారి విక్రమ్ 'నా వైఫ్ మిస్సింగ్' నుంచి మనసును హత్తుకునే లిరికల్ సాంగ్.. అక్టోబర్ 22 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్! ఓకే బందు వర్గానికి పదవులా.. మున్నూరు కాపు సంఘం మూడు ముక్కలు కావడానికి కారణం మీరు కాదా... విలేకరుల సమావేశంలో మున్నూరు కాపు సంఘం రాష్ట్ర నాయకులు శెట్టి రంగారావు, నగర అధ్యక్షులు రాపర్తి శరత్ ఎన్నారై వాసవి ఫౌండేషన్ సహకారంతో కడవెరుగు గ్రామంలో నూతన వాటర్ ప్లాంట్ ప్రారంభం జెడ్పిటిసి ఎంపిటిసి ఎన్నికలపై చర్చ. ఘనంగా మాజీ స్పీకర్ సిరికొండ జన్మదిన వేడుకలు కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైంది-మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి యూట్యూబ్‌లో రికార్డులు సృష్టిస్తున్న 'రణబాలి' కోబలి సాంగ్.. 20 మిలియన్లకు పైగా వ్యూస్‌తో దూకుడు! 94వ ఎయిర్ఫోర్స్ దినోత్సవం మాజీ సైనికుల సంక్షేమానికి అండగా ఉంటాం.......ఎమ్మెల్యే ధూళిపాళ్ళ 'రామాయణ' నుంచి సంచలన అప్‌డేట్.. జటాయువు పాత్రలో ప్రముఖ నటుడు అనుపమ్ ఖేర్! కరీంనగర్ జిల్లాలో ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం అద్దంకిలో విశ్రాంత ఉద్యోగుల సంఘం 42వ ఆవిర్భావ దినోత్సవం. జగన్మాత దివ్యదర్శనంతో పులకించిన దర్శకుడు బోయపాటి శ్రీను 'ఖలిఫా' బాక్సాఫీస్ ఫలితంపై దర్శకుడు వైశాఖ్ ఆసక్తికర స్పందన.. పృథ్వీరాజ్ సుకుమారన్‌పై కక్షగట్టడం వల్లే ఫ్లాప్ అంటూ పోస్ట్ వైరల్! కావలి చైర్మన్ అభ్యర్థిగా రాజ్ కుమార్ చెరదా?

18 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం పట్టివేత

Select Suryaa Now
18 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం పట్టివేత

సూర్య మానకొండూరు: మండల పరిధిలోని అన్నారం గ్రామంలో అక్రమంగా సాగుతున్న పీడీఎస్ (రేషన్) బియ్యం రీసైక్లింగ్ వ్యాపార గుట్టును టాస్క్ ఫోర్స్ అధికారులు రట్టు చేశారు. నమ్మదగిన సమాచారం మేరకు మంగళవారం అన్నారం గ్రామంలో ఏసీపీ టాస్క్ ఫోర్స్ సతీష్ కుమార్ ఆధ్వర్యంలో అధికారులు మెరుపు దాడి నిర్వహించారు.టాస్క్ ఫోర్స్ అధికారుల కథనం ప్రకారం.. అన్నారం గ్రామానికి చెందిన వెల్ది వెంకన్న చుట్టుపక్కల గ్రామాల నుండి రేషన్ బియ్యాన్ని అక్రమంగా సేకరించి, వాటిని పాలిష్ చేసి రీసైక్లింగ్ (మళ్లీ కొత్త బియ్యంలా మార్చడం) చేస్తున్నాడనే పక్కా సమాచారంతో అధికారులు రంగంలోకి దిగారు. గ్రామంలో వెంకన్నకు సంబంధించిన మినీ మోడ్రన్ రైస్ మిల్లుపై అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీలలో ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా నిల్వ ఉంచిన సుమారు 18 క్వింటాళ్ల పీడీఎస్ (రేషన్) బియ్యాన్ని అధికారులు గుర్తించి, స్వాధీనం చేసుకున్నారు.స్వాధీనం చేసుకున్న 18 క్వింటాళ్ల బియ్యాన్ని, పట్టుబడిన నిందితుడిని తదుపరి చట్టపరమైన విచారణ నిమిత్తం మానకొండూరు పోలీసులకు అప్పగించ్చారు. ఈ మేరకు అక్రమంగా రేషన్ బియ్యాన్ని నిల్వ ఉంచి రీసైక్లింగ్ చేస్తున్న నిందితుడు వెల్ది వెంకన్నపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మానకొండూరు పోలీసులు తెలిపారు. పేదల బియ్యాన్ని అక్రమంగా బ్లాక్ మార్కెట్ కు తరలిస్తే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని, కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా అధికారులు హెచ్చరించారు.