BREAKING
ఓటీటీలోకి బ్లాక్‌బస్టర్ మూవీ 'DC'.. ఐదు భాషల్లో స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే? పారిస్‌లో విద్యార్థుల పర్యావరణ పోరాటం డీజిల్ ధరల మంట...చెత్త నుంచి ట్రాక్టర్లకు ఇంధనం తయారు చేస్తున్న బొలీవియా రైతు నేచురల్ స్టార్ నానితో క్లాసిక్ లవ్ డ్రామా.. ఆఫర్ దక్కించుకున్న క్రేజీ హీరోయిన్ రుక్మిణి వసంత్! కోరలు చాస్తున్న ద్రవ్యోల్బణం: రాబోయే 9 నెలల్లో ఆర్‌బీఐ 75 బేసిస్ పాయింట్ల మేర వడ్డీ రేట్లు పెంచే అవకాశం.. బోఫా, యూబీఎస్ అంచనా! బ్యాంకింగ్ రంగాన్ని కుదిపేస్తున్న రాజీనామాలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ముప్పును అరికట్టేందుకు అంతర్జాతీయ సంస్థ అవసరం సినిమాలకు బ్రేక్ ఇవ్వడానికి అసలు కారణం అదే.. స్పష్టం చేసిన క్రేజీ హీరోయిన్ మృణాల్ ఠాకూర్! 106 డాలర్ల పైనే బ్రెంట్ క్రూడ్ ఆయిల్: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, సౌదీపై దాడులతో సరఫరా ఆందోళనలు! సింగరేణి కార్మికులకు లాభాల్లో 34 శాతం వాటా.. కాంట్రాక్ట్ కార్మికులకు రూ.5,500 బోనస్ 15 రోజుల్లో పెండింగ్ వారసత్వ ఉద్యోగాల సమస్య పరిష్కారానికి చర్యలు.. విస్కీ, సాల్మన్ నుంచి వార్షిక డేటా ఆడిట్‌ల వరకు: భారత్-యూకే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA)లో కీలక అంశాలివే! ప్రభుత్వ కాలనీలకు ప్రత్యేక నిధులతో మౌలిక సదుపాయాలు కల్పించాలి నియోజకవర్గ అభివృద్ధి నిధులను రూ.5 కోట్లకు పెంచాలి: సీపీఎం జిల్లా కార్యదర్శి జె.ఎన్.వి. గోపాలన్ మార్కెట్ యార్డులో 50 రూపాయలకే 26 కేజీల సన్న బియ్యం. సినిమాల్లోకి రావాలంటే నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్‌పై నటి నీతి టేలర్ సంచలన ఆరోపణలు! ఫేస్‌బుక్‌లో ఆన్‌లైన్ గేమింగ్ పెట్టుబడుల పేరుతో సైబర్ మోసం.. ముగ్గురు నిందితుల అరెస్ట్: ఎస్పీ స్నేహ మెహ్రా

ఓకే బందు వర్గానికి పదవులా.. మున్నూరు కాపు సంఘం మూడు ముక్కలు కావడానికి కారణం మీరు కాదా... విలేకరుల సమావేశంలో మున్నూరు కాపు సంఘం రాష్ట్ర నాయకులు శెట్టి రంగారావు, నగర అధ్యక్షులు రాపర్తి శరత్

Select Suryaa Now
ఓకే బందు వర్గానికి పదవులా.. మున్నూరు కాపు సంఘం మూడు ముక్కలు కావడానికి కారణం మీరు కాదా... విలేకరుల సమావేశంలో మున్నూరు కాపు సంఘం రాష్ట్ర నాయకులు శెట్టి రంగారావు, నగర అధ్యక్షులు రాపర్తి శరత్

---ఒకే బంధు వర్గానికి...పదవులా...
-- మున్నూరు కాపు సంఘం మూడు ముక్కలు కావడానికి కారణం మీరు కా దా...
-- కలిసి పోవడానికి మేము సిద్ధమే...
---త్వరలో జిల్లా, నగర కమిటీలు వేస్తాం
--మున్నూరు కాపు సంఘం రాష్ట్ర నాయకులు శెట్టి రంగారావు, నగర అధ్యక్షులు రాపర్తి శరత్
ఖమ్మం, సూర్య (మేజర్ న్యూస్):

మున్నూరు కాపు సంఘంలో ఒకే బంధు వర్గానికి పదవులా అని ఆ సంఘం నాయకులు ప్రశ్నించారు. ఖమ్మం లోని రాపర్తి శరత్ కార్యాలయంలో మంగళవారం జరిగిన విలేకర్ల సమావేశంలో మున్నూరు కాపు సంఘం సీనియర్ రాష్ట్ర నాయకులు శెట్టి రంగారావు, మాజీ కార్పొరేటర్, సంఘం నగర అధ్యక్షులు రాపర్తి శరత్ మాట్లాడారు. సీనియర్ నాయకులు మేకల సంగయ్య ఫోటో లేకుండా ఫ్లెక్సీలు వేశారని, ఇది అవమానకరమని అన్నారు.  అందరూ కలిసి ఉండాలని అనే ఉద్దేశ్యంతో ఏనాడూ సంఘంలో పని చెయ్యని శీలంశెట్టి వీరభద్రం ను జిల్లా అధ్యక్షుడిగా ప్రకటించినా తాము అంగీకరించామన్నారు. 11 ఏళ్ల నుండి సంఘాన్ని అడ్డం పెట్టుకుని పబ్బం గడుపుకున్నదెవరో అందరికీ తెలుసునన్నారు. రాపర్తి కుటుంబం నుండి వచ్చిన వ్యక్తిని నగర అధ్యక్షులు గా నియమించినందుకు కుట్ర చేశారన్నారు. ఆత్మీయ సమ్మేళనానికి తమను ఎందుకు పిలువలేదో చెప్పాలన్నారు. కలిసిపోయే గుణముంటే తమను పిలిపించి మాట్లాడాలి కదా అని అన్నారు.  కలిసిపోవడానికి తాము సిద్ధమేనన్నారు. లేకుంటే కుల పెద్దలను సంప్రదించి తమ పని తాము చేసుకపోతామన్నారు. త్వరలోనే జిల్లా, నగర కమిటీలు వేస్తామన్నారు. ఈ సమావేశం లో ట్రస్టు బోర్డు సెక్రటరీ కలిశెట్టి నర్సయ్య, గౌరవ సలహాదారులు మూలగుండ్ల శ్రీహరి, నగర కార్యదర్శి బైరిశెట్టి శ్రీనివాస్, కోశాధికారి గంగిశెట్టి శ్రీనివాస్, కోయచలక ఉప సర్పంచ్ మాధవశెట్టి హన్మంతరావు, కార్మిక విభాగం అధ్యక్షుడు విప్లవ కుమార్, మహిళా విభాగం నాయకురాలు బాసెట్టి శ్రావ్య, నాయకులు బైరిశెట్టి పవన్ కుమార్, పసుపు లేటి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.