BREAKING
ఇళ్ల కోల్పోయిన లెబనాన్ ప్రజలకు ఆర్థిక సాయం వాల్‌స్ట్రీట్, క్రిప్టో సంస్థలపై డెమోక్రాట్ల కన్ను ఓటీటీలోకి బ్లాక్‌బస్టర్ మూవీ 'DC'.. ఐదు భాషల్లో స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే? పారిస్‌లో విద్యార్థుల పర్యావరణ పోరాటం డీజిల్ ధరల మంట...చెత్త నుంచి ట్రాక్టర్లకు ఇంధనం తయారు చేస్తున్న బొలీవియా రైతు నేచురల్ స్టార్ నానితో క్లాసిక్ లవ్ డ్రామా.. ఆఫర్ దక్కించుకున్న క్రేజీ హీరోయిన్ రుక్మిణి వసంత్! కోరలు చాస్తున్న ద్రవ్యోల్బణం: రాబోయే 9 నెలల్లో ఆర్‌బీఐ 75 బేసిస్ పాయింట్ల మేర వడ్డీ రేట్లు పెంచే అవకాశం.. బోఫా, యూబీఎస్ అంచనా! బ్యాంకింగ్ రంగాన్ని కుదిపేస్తున్న రాజీనామాలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ముప్పును అరికట్టేందుకు అంతర్జాతీయ సంస్థ అవసరం సినిమాలకు బ్రేక్ ఇవ్వడానికి అసలు కారణం అదే.. స్పష్టం చేసిన క్రేజీ హీరోయిన్ మృణాల్ ఠాకూర్! 106 డాలర్ల పైనే బ్రెంట్ క్రూడ్ ఆయిల్: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, సౌదీపై దాడులతో సరఫరా ఆందోళనలు! సింగరేణి కార్మికులకు లాభాల్లో 34 శాతం వాటా.. కాంట్రాక్ట్ కార్మికులకు రూ.5,500 బోనస్ 15 రోజుల్లో పెండింగ్ వారసత్వ ఉద్యోగాల సమస్య పరిష్కారానికి చర్యలు.. విస్కీ, సాల్మన్ నుంచి వార్షిక డేటా ఆడిట్‌ల వరకు: భారత్-యూకే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA)లో కీలక అంశాలివే! ప్రభుత్వ కాలనీలకు ప్రత్యేక నిధులతో మౌలిక సదుపాయాలు కల్పించాలి నియోజకవర్గ అభివృద్ధి నిధులను రూ.5 కోట్లకు పెంచాలి: సీపీఎం జిల్లా కార్యదర్శి జె.ఎన్.వి. గోపాలన్ మార్కెట్ యార్డులో 50 రూపాయలకే 26 కేజీల సన్న బియ్యం.

జనగణన–2027 ప్రక్రియను పారదర్శకంగా, గడువులోగా పూర్తి చేయాలి: అదనపు కలెక్టర్ వెంకటాచారి

Select Suryaa Now
జనగణన–2027 ప్రక్రియను పారదర్శకంగా, గడువులోగా పూర్తి చేయాలి: అదనపు కలెక్టర్ వెంకటాచారి

వికారాబాద్ జిల్లా ప్రతినిధి, మేజర్ న్యూస్ (అక్టోబర్ 13):జనగణన–2027 ప్రక్రియను సమర్థవంతంగా, పారదర్శకంగా, నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వెంకటాచారి అధికారులకు సూచించారు. జనగణనలో సేకరించే వివరాలు కచ్చితంగా ఉండేలా చూడాలని, విధుల నిర్వహణలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావివ్వకుండా చిత్తశుద్ధితో పనిచేయాలని స్పష్టం చేశారు.జనగణన–2027 రెండో దశకు సంబంధించి ఛార్జ్ క్లర్కులు, టెక్నికల్ అసిస్టెంట్లకు మంగళవారం వికారాబాద్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన శిక్షణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. దేశ ప్రతిష్టను ఇనుమడింపజేసే కీలకమైన జనగణన ప్రక్రియలో భాగస్వాములై పనిచేసే అవకాశాన్ని అదృష్టంగా భావించాలని అన్నారు. జనగణనకు సంబంధించిన ప్రతి అంశంపై అధికారులు, సిబ్బంది స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలని సూచించారు.క్షేత్రస్థాయిలో విధుల నిర్వహణ సమయంలో ఎదురయ్యే సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి, సందేహాలను నివృత్తి చేసుకోవాలని ఛార్జ్ క్లర్కులు, టెక్నికల్ అసిస్టెంట్లకు సూచించారు. తమకు కేటాయించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించాలని, సమాచార సేకరణలో కచ్చితత్వానికి ప్రాధాన్యం ఇవ్వాలని తెలిపారు. జనగణన విజయవంతంగా నిర్వహించేందుకు శిక్షణ కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయని పేర్కొన్నారు.జిల్లాలో జనగణన మొదటి దశలో భాగంగా ఇంటి జాబితా తయారీ ప్రక్రియ కోసం 2,028 హౌస్‌లిస్టింగ్ బ్లాకులను ఏర్పాటు చేసినట్లు అదనపు కలెక్టర్ వెల్లడించారు. ఈ ప్రక్రియలో 1,600 మంది ఎన్యూమరేటర్లు, 271 మంది సూపర్‌వైజర్లు విధులు నిర్వహించినట్లు తెలిపారు.శిక్షణ కార్యక్రమంలో జనగణన రెండో దశకు సంబంధించిన విధివిధానాలు, అధికారుల బాధ్యతలు, డిజిటల్ పద్ధతిలో సమాచార సేకరణ, సాంకేతిక సాధనాల వినియోగం, డేటా నమోదు, సమాచార గోప్యత వంటి అంశాలపై అధికారులు, సిబ్బందికి అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో సీపీఓ వెంకటేశ్వర్లు, ప్రణాళిక శాఖ రిటైర్డ్ డైరెక్టర్ దయానంద్, ఏడీ రవిచంద్ర, శిక్షణాధికారి జంగయ్యతో పాటు సంబంధిత అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.