BREAKING
ఇళ్ల కోల్పోయిన లెబనాన్ ప్రజలకు ఆర్థిక సాయం వాల్‌స్ట్రీట్, క్రిప్టో సంస్థలపై డెమోక్రాట్ల కన్ను ఓటీటీలోకి బ్లాక్‌బస్టర్ మూవీ 'DC'.. ఐదు భాషల్లో స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే? పారిస్‌లో విద్యార్థుల పర్యావరణ పోరాటం డీజిల్ ధరల మంట...చెత్త నుంచి ట్రాక్టర్లకు ఇంధనం తయారు చేస్తున్న బొలీవియా రైతు నేచురల్ స్టార్ నానితో క్లాసిక్ లవ్ డ్రామా.. ఆఫర్ దక్కించుకున్న క్రేజీ హీరోయిన్ రుక్మిణి వసంత్! కోరలు చాస్తున్న ద్రవ్యోల్బణం: రాబోయే 9 నెలల్లో ఆర్‌బీఐ 75 బేసిస్ పాయింట్ల మేర వడ్డీ రేట్లు పెంచే అవకాశం.. బోఫా, యూబీఎస్ అంచనా! బ్యాంకింగ్ రంగాన్ని కుదిపేస్తున్న రాజీనామాలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ముప్పును అరికట్టేందుకు అంతర్జాతీయ సంస్థ అవసరం సినిమాలకు బ్రేక్ ఇవ్వడానికి అసలు కారణం అదే.. స్పష్టం చేసిన క్రేజీ హీరోయిన్ మృణాల్ ఠాకూర్! 106 డాలర్ల పైనే బ్రెంట్ క్రూడ్ ఆయిల్: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, సౌదీపై దాడులతో సరఫరా ఆందోళనలు! సింగరేణి కార్మికులకు లాభాల్లో 34 శాతం వాటా.. కాంట్రాక్ట్ కార్మికులకు రూ.5,500 బోనస్ 15 రోజుల్లో పెండింగ్ వారసత్వ ఉద్యోగాల సమస్య పరిష్కారానికి చర్యలు.. విస్కీ, సాల్మన్ నుంచి వార్షిక డేటా ఆడిట్‌ల వరకు: భారత్-యూకే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA)లో కీలక అంశాలివే! ప్రభుత్వ కాలనీలకు ప్రత్యేక నిధులతో మౌలిక సదుపాయాలు కల్పించాలి నియోజకవర్గ అభివృద్ధి నిధులను రూ.5 కోట్లకు పెంచాలి: సీపీఎం జిల్లా కార్యదర్శి జె.ఎన్.వి. గోపాలన్ మార్కెట్ యార్డులో 50 రూపాయలకే 26 కేజీల సన్న బియ్యం.

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదుకు అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలి: తహసీల్దార్ విజయ్ కుమార్

Select Suryaa Now
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదుకు అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలి: తహసీల్దార్ విజయ్ కుమార్

పూడూరు, మేజర్ న్యూస్ (అక్టోబర్ 13): మహబూబ్‌నగర్–రంగారెడ్డి–హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గానికి సంబంధించి ఓటరు నమోదు ప్రక్రియ ప్రారంభమైందని పూడూరు తహసీల్దార్ విజయ్ కుమార్ తెలిపారు. అర్హులైన పట్టభద్రులందరూ తమ పేర్లను ఓటరు జాబితాలో నమోదు చేసుకోవాలని ఆయన సూచించారు. ప్రజాస్వామ్య ప్రక్రియలో పట్టభద్రులు భాగస్వాములు కావాలంటే ఓటు హక్కును వినియోగించుకోవడంతో పాటు ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకోవడం ముఖ్యమన్నారు.2023 అక్టోబర్ 31వ తేదీ నాటికి ఏదైనా గుర్తింపు పొందిన డిగ్రీ పూర్తి చేసిన పట్టభద్రులు ఈ ఓటరు నమోదు కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని పేర్కొన్నారు. దరఖాస్తు సమయంలో డిగ్రీ లేదా ప్రొవిజనల్ సర్టిఫికెట్, ఆధార్ కార్డు, పాస్‌పోర్ట్ సైజు ఫొటో, నివాస ధ్రువీకరణ పత్రం, ఓటరు గుర్తింపు కార్డు (EPIC) జిరాక్స్ ప్రతులు లేదా సాఫ్ట్ కాపీలను సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు.అర్హులైన వారు ఫారం-18 సమర్పించి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఇందుకోసం తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి అధికారిక వెబ్‌సైట్ https://ceotserms2.telangana.gov.in/MLC/Form18.aspx ను సందర్శించాలని సూచించారు. అలాగే సమీపంలోని ఓటరు నమోదు కేంద్రాలను సంప్రదించి కూడా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.గతంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరుగా నమోదై ఉన్నవారు సైతం ప్రస్తుత నమోదు ప్రక్రియలో మళ్లీ కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. అర్హులైన పట్టభద్రులు ఈ విషయాన్ని గమనించి తమ పేర్లను నమోదు చేసుకోవడంతో పాటు, తమ స్నేహితులు, కుటుంబ సభ్యుల్లోని అర్హులైన పట్టభద్రులకు కూడా అవగాహన కల్పించాలని తహసీల్దార్ విజయ్ కుమార్ కోరారు.

రిపోర్టర్: శ్రీరాములు,పూడూరు, వికారాబాద్ జిల్లా.