లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
మేజర్ న్యూస్, మంచాల;గ్రామ సర్పంచ్ నేనావత్ బాలకృష్ణ చేతుల మీదుగా పంపిణీ మంచాల మండలం రంగాపూర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో మంగళవారం స్మార్ట్ రేషన్ కార్డులను గ్రామ సర్పంచ్ నేనావత్ బాలకృష్ణ ఆధ్వర్యంలో లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు వల్లవోజు అశోక్, డబ్బికార్ అజయ్ బాస్, నేనావత్ లక్ష్మి, నేనావత్ శివ, ఇటిక్యాల దివ్య, జీపీ ఓ సుదర్శన్, పంచాయతీ కార్యదర్శి పురుషోత్తం రెడ్డి, కారోబార్ అంజయ్య, మాజీ ఉపసర్పంచ్ కుకుడాల జంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
✍️ఎర్ర లింగం, మేజర్ న్యూస్, మంచాల