ఎన్నారై వాసవి ఫౌండేషన్ సహకారంతో కడవెరుగు గ్రామంలో నూతన వాటర్ ప్లాంట్ ప్రారంభం
*ఎన్నారై వాసవి ఫౌండేషన్ సహకారంతో కడవెరుగు గ్రామంలో నూతన వాటర్ ప్లాంట్ ప్రారంభం*
*దాతల సహకారంతో తాగునీటి సౌకర్యం.. గ్రామాభివృద్ధికి పెద్దపీట: సర్పంచ్ రమేష్ గుప్తా*
చేర్యాల మేజర్ న్యూస్ ..................
చేర్యాల: చేర్యాల మండలం కడవెరుగు గ్రామంలో అమెరికా ఎన్నారై వాసవి ఫౌండేషన్ సహకారంతో నూతన వాటర్ ప్లాంట్‌ను ప్రారంభించారు. ప్లాంట్ ఏర్పాటుకు గంపా రామ్మోహన్, పద్మావతి ఆర్థిక సహకారం అందించగా, స్థలం కోసం ధరూరు సుహాసిని, రంగారెడ్డి సహకరించారు. భవన నిర్మాణానికి గ్రామపంచాయతీ పాలకవర్గం తోడ్పాటునందించింది.ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ తాళ్లపల్లి రమేష్ గుప్తా మాట్లాడుతూ.. గత పది నెలల్లో గ్రామంలో సీసీ కెమెరాల ఏర్పాటు, చెరువుల సుందరీకరణ, చెరువు మెట్ల నిర్మాణం, వాటర్ ప్లాంట్ ఏర్పాటు వంటి అభివృద్ధి పనులను చేపట్టినట్లు తెలిపారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ, మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలతో గ్రామాన్ని ముందుకు తీసుకెళ్తామని పేర్కొన్నారు. గ్రామాభివృద్ధికి సహకరించిన దాతలకు గ్రామ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపారు.గ్రామంలో నూతన వాటర్ ప్లాంట్ ఏర్పాటు కావడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. గతంలో ఉన్న వాటర్ ప్లాంట్ నిర్వహణపై నిర్లక్ష్యం ఉండేదని, ప్రస్తుతం కొత్త ప్లాంట్ అందుబాటులోకి రావడం సంతోషకరమని పేర్కొన్నారు. ఇదే స్ఫూర్తితో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని గ్రామపంచాయతీ పాలకవర్గాన్ని కోరారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తాళ్ళపల్లి రమేష్ గుప్తా ,ఉప సర్పంచ్ జంగ సురేందర్ ,సెక్రటరీ తరిగొప్పుల రాజు ,వార్డు మెంబెర్లు ,గ్రామ పంచాయతి సిబ్బంది ,గ్రామస్తులు పాల్గొన్నారు .