BREAKING
ఇళ్ల కోల్పోయిన లెబనాన్ ప్రజలకు ఆర్థిక సాయం వాల్‌స్ట్రీట్, క్రిప్టో సంస్థలపై డెమోక్రాట్ల కన్ను ఓటీటీలోకి బ్లాక్‌బస్టర్ మూవీ 'DC'.. ఐదు భాషల్లో స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే? పారిస్‌లో విద్యార్థుల పర్యావరణ పోరాటం డీజిల్ ధరల మంట...చెత్త నుంచి ట్రాక్టర్లకు ఇంధనం తయారు చేస్తున్న బొలీవియా రైతు నేచురల్ స్టార్ నానితో క్లాసిక్ లవ్ డ్రామా.. ఆఫర్ దక్కించుకున్న క్రేజీ హీరోయిన్ రుక్మిణి వసంత్! కోరలు చాస్తున్న ద్రవ్యోల్బణం: రాబోయే 9 నెలల్లో ఆర్‌బీఐ 75 బేసిస్ పాయింట్ల మేర వడ్డీ రేట్లు పెంచే అవకాశం.. బోఫా, యూబీఎస్ అంచనా! బ్యాంకింగ్ రంగాన్ని కుదిపేస్తున్న రాజీనామాలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ముప్పును అరికట్టేందుకు అంతర్జాతీయ సంస్థ అవసరం సినిమాలకు బ్రేక్ ఇవ్వడానికి అసలు కారణం అదే.. స్పష్టం చేసిన క్రేజీ హీరోయిన్ మృణాల్ ఠాకూర్! 106 డాలర్ల పైనే బ్రెంట్ క్రూడ్ ఆయిల్: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, సౌదీపై దాడులతో సరఫరా ఆందోళనలు! సింగరేణి కార్మికులకు లాభాల్లో 34 శాతం వాటా.. కాంట్రాక్ట్ కార్మికులకు రూ.5,500 బోనస్ 15 రోజుల్లో పెండింగ్ వారసత్వ ఉద్యోగాల సమస్య పరిష్కారానికి చర్యలు.. విస్కీ, సాల్మన్ నుంచి వార్షిక డేటా ఆడిట్‌ల వరకు: భారత్-యూకే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA)లో కీలక అంశాలివే! ప్రభుత్వ కాలనీలకు ప్రత్యేక నిధులతో మౌలిక సదుపాయాలు కల్పించాలి నియోజకవర్గ అభివృద్ధి నిధులను రూ.5 కోట్లకు పెంచాలి: సీపీఎం జిల్లా కార్యదర్శి జె.ఎన్.వి. గోపాలన్ మార్కెట్ యార్డులో 50 రూపాయలకే 26 కేజీల సన్న బియ్యం.

విద్యుత్ కోతలతో ఎండుతున్న ఆలుగడ్డ పంట.. జనరేటర్‌తో నీటి తడి పెడుతున్న రైతు.!

Select Suryaa Now
విద్యుత్ కోతలతో ఎండుతున్న ఆలుగడ్డ పంట.. జనరేటర్‌తో నీటి తడి పెడుతున్న రైతు.!

మర్పల్లి,మేజర్ న్యూస్:విద్యుత్ సరఫరాలో అంతరాయాలతో పంటలు ఎండిపోతుండటంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బూచన్‌పల్లి గ్రామానికి చెందిన రైతు బోయిని నర్సింలు తనకున్న రెండు ఎకరాల పొలంలో ఆలుగడ్డ పంట సాగు చేశారు. అయితే, ప్రభుత్వం నుంచి విద్యుత్ సరఫరా సక్రమంగా లేకపోవడంతో పంటకు అవసరమైన నీరు అందక ఆలుగడ్డ పంట ఎండిపోయే పరిస్థితి ఏర్పడింది.కష్టపడి సాగు చేసిన పంటను కాపాడుకునేందుకు రైతు నర్సింలు ప్రత్యామ్నాయ మార్గాన్ని ఆశ్రయించారు. రోజుకు రూ.2,000 అద్దె చెల్లించి జనరేటర్‌ను తీసుకొచ్చి గత మూడు రోజులుగా పంటకు నీటిని అందిస్తున్నారు. ఇప్పటికే సాగు కోసం పెట్టుబడులు పెట్టిన రైతుకు జనరేటర్ అద్దె అదనపు భారంగా మారింది. పంటను కాపాడుకునేందుకు తప్పనిసరి పరిస్థితుల్లో అధిక ఖర్చు భరించాల్సి వస్తోందని రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ప్రభుత్వం ఇప్పటికైనా రైతుల కష్టాలను గుర్తించి వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్‌ను సక్రమంగా సరఫరా చేయాలని రైతు కోరుతున్నారు. విద్యుత్ అంతరాయాల కారణంగా పంటలు నష్టపోకుండా అధికారులు తగిన చర్యలు తీసుకుని, రైతులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

రిపోర్టర్: రాములు, మర్పల్లి, వికారాబాద్ జిల్లా.