BREAKING
106 డాలర్ల పైనే బ్రెంట్ క్రూడ్ ఆయిల్: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, సౌదీపై దాడులతో సరఫరా ఆందోళనలు! సింగరేణి కార్మికులకు లాభాల్లో 34 శాతం వాటా.. కాంట్రాక్ట్ కార్మికులకు రూ.5,500 బోనస్ 15 రోజుల్లో పెండింగ్ వారసత్వ ఉద్యోగాల సమస్య పరిష్కారానికి చర్యలు.. విస్కీ, సాల్మన్ నుంచి వార్షిక డేటా ఆడిట్‌ల వరకు: భారత్-యూకే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA)లో కీలక అంశాలివే! ప్రభుత్వ కాలనీలకు ప్రత్యేక నిధులతో మౌలిక సదుపాయాలు కల్పించాలి నియోజకవర్గ అభివృద్ధి నిధులను రూ.5 కోట్లకు పెంచాలి: సీపీఎం జిల్లా కార్యదర్శి జె.ఎన్.వి. గోపాలన్ మార్కెట్ యార్డులో 50 రూపాయలకే 26 కేజీల సన్న బియ్యం. సినిమాల్లోకి రావాలంటే నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్‌పై నటి నీతి టేలర్ సంచలన ఆరోపణలు! ఫేస్‌బుక్‌లో ఆన్‌లైన్ గేమింగ్ పెట్టుబడుల పేరుతో సైబర్ మోసం.. ముగ్గురు నిందితుల అరెస్ట్: ఎస్పీ స్నేహ మెహ్రా రైతాంగ వ్యతిరేక విధానాలపై పోరాటం..* *కేంద్ర మోడీ ప్రభుత్వం రైతాంగానికి ఇచ్చిన హామీల అమలు చేయాలి..* *మద్దతు ధరల గ్యారెంటీ చట్టం తీసుకురావాలి. రేషన్ కార్డుకు కేజీ 50రూపాయలతో 26 కేజీల సన్న బియ్యం మూడు గ్రామాల్లో పట్టాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ విద్యుత్ కోతలతో ఎండుతున్న ఆలుగడ్డ పంట.. జనరేటర్‌తో నీటి తడి పెడుతున్న రైతు.! తాడిపత్రిపై ఎస్పీ ప్రత్యేక దృష్టి ఎన్నికల భద్రతా ఏర్పాట్లపై క్షేత్రస్థాయి సమీక్ష.. సమస్యాత్మక ప్రాంతాల్లో పర్యటన హాలీవుడ్‌లో కలకలం.. పోలీసులపై దాడి కేసులో ప్రముఖ నటి సెల్మా బ్లెయిర్ అరెస్ట్! లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ రేలంగిలో 2,840 పట్టాదారు పాస్‌పుస్తకాల పంపిణీ

కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైంది-మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి

Select Suryaa Now
కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైంది-మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి

గణపురం, మేజర్ న్యూస్, కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు.రైతులకు 24 గంటల పాటు నాణ్యమైన విద్యుత్‌ సరఫరా చేయాలని డిమాండ్‌ చేస్తూ మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్‌ నాయకులు, రైతులు మంగళవారం గణపురం మండలం చెల్పూర్‌లో ధర్నా నిర్వహించారు. పరకాల–భూపాలపల్లి ప్రధాన రహదారిపై బైఠాయించి విద్యుత్‌ కోతలకు నిరసనగా ఆందోళన చేపట్టారు.ఈ సందర్భంగా గండ్ర వెంకట రమణారెడ్డి మాట్లాడుతూ గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్‌ రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్‌ అందించడంతో పాటు రైతుబంధు పథకంతో అండగా నిలిచారని అన్నారు. ప్రస్తుత ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు.
రైతులకు కనీసం ఎనిమిది గంటల విద్యుత్‌ కూడా సక్రమంగా అందడం లేదని, దీంతో పంటలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. పంట చేతికొచ్చే సమయంలో విద్యుత్‌ కోతలతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులకు నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్‌ సరఫరా చేయాలని డిమాండ్‌ చేశారు.
చెల్పూర్‌లో ప్రధాన రహదారిపై నిర్వహించిన ధర్నాతో సుమారు ఐదు నుంచి ఆరు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు, వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆందోళనలో బీఆర్‌ఎస్‌ నాయకులు, రైతు సంఘాల ప్రతినిధులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

రిపోర్టర్; ఎల్లయ్య గౌడ్, గణపురం, జయశంకర్ భూపాలపల్లి జిల్లా