BREAKING
ఇళ్ల కోల్పోయిన లెబనాన్ ప్రజలకు ఆర్థిక సాయం వాల్‌స్ట్రీట్, క్రిప్టో సంస్థలపై డెమోక్రాట్ల కన్ను ఓటీటీలోకి బ్లాక్‌బస్టర్ మూవీ 'DC'.. ఐదు భాషల్లో స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే? పారిస్‌లో విద్యార్థుల పర్యావరణ పోరాటం డీజిల్ ధరల మంట...చెత్త నుంచి ట్రాక్టర్లకు ఇంధనం తయారు చేస్తున్న బొలీవియా రైతు నేచురల్ స్టార్ నానితో క్లాసిక్ లవ్ డ్రామా.. ఆఫర్ దక్కించుకున్న క్రేజీ హీరోయిన్ రుక్మిణి వసంత్! కోరలు చాస్తున్న ద్రవ్యోల్బణం: రాబోయే 9 నెలల్లో ఆర్‌బీఐ 75 బేసిస్ పాయింట్ల మేర వడ్డీ రేట్లు పెంచే అవకాశం.. బోఫా, యూబీఎస్ అంచనా! బ్యాంకింగ్ రంగాన్ని కుదిపేస్తున్న రాజీనామాలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ముప్పును అరికట్టేందుకు అంతర్జాతీయ సంస్థ అవసరం సినిమాలకు బ్రేక్ ఇవ్వడానికి అసలు కారణం అదే.. స్పష్టం చేసిన క్రేజీ హీరోయిన్ మృణాల్ ఠాకూర్! 106 డాలర్ల పైనే బ్రెంట్ క్రూడ్ ఆయిల్: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, సౌదీపై దాడులతో సరఫరా ఆందోళనలు! సింగరేణి కార్మికులకు లాభాల్లో 34 శాతం వాటా.. కాంట్రాక్ట్ కార్మికులకు రూ.5,500 బోనస్ 15 రోజుల్లో పెండింగ్ వారసత్వ ఉద్యోగాల సమస్య పరిష్కారానికి చర్యలు.. విస్కీ, సాల్మన్ నుంచి వార్షిక డేటా ఆడిట్‌ల వరకు: భారత్-యూకే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA)లో కీలక అంశాలివే! ప్రభుత్వ కాలనీలకు ప్రత్యేక నిధులతో మౌలిక సదుపాయాలు కల్పించాలి నియోజకవర్గ అభివృద్ధి నిధులను రూ.5 కోట్లకు పెంచాలి: సీపీఎం జిల్లా కార్యదర్శి జె.ఎన్.వి. గోపాలన్ మార్కెట్ యార్డులో 50 రూపాయలకే 26 కేజీల సన్న బియ్యం.

తాడిపత్రిపై ఎస్పీ ప్రత్యేక దృష్టి ఎన్నికల భద్రతా ఏర్పాట్లపై క్షేత్రస్థాయి సమీక్ష.. సమస్యాత్మక ప్రాంతాల్లో పర్యటన

Select Suryaa Now
తాడిపత్రిపై ఎస్పీ ప్రత్యేక దృష్టి  ఎన్నికల భద్రతా ఏర్పాట్లపై క్షేత్రస్థాయి సమీక్ష.. సమస్యాత్మక ప్రాంతాల్లో పర్యటన

అనంతపురం బ్యూరో (అనంతపురం ప్రతినిధి మేజర్ న్యూస్) : స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో సమస్యాత్మక ప్రాంతంగా పేరున్న తాడిపత్రి పట్టణంపై జిల్లా ఎస్పీ పి.జగదీష్ ఐపీఎస్ ప్రత్యేక దృష్టి సారించారు. ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు చేపట్టాల్సిన భద్రతా చర్యలను సమీక్షిస్తూ మంగళవారం తాడిపత్రిలో విస్తృతంగా పర్యటించారు. ఎన్నికల పంపిణీ, ఓట్ల లెక్కింపు కేంద్రాలతో పాటు నామినేషన్ల స్వీకరణ కేంద్రాన్ని పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.

పర్యటనలో భాగంగా తొలుత తాడిపత్రి పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటు చేయనున్న ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రం, ఓట్ల లెక్కింపు కేంద్రాలను ఎస్పీ పరిశీలించారు. ఎన్నికల సామగ్రి భద్రత, సిబ్బంది రాకపోకలు, ఓట్ల లెక్కింపు సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులతో చర్చించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు.

అనంతరం నామినేషన్ల స్వీకరణ జరగనున్న తాడిపత్రి మున్సిపల్ కార్యాలయాన్ని సందర్శించారు. నామినేషన్ల సమయంలో ఎన్నికల నియమావళి అమలు, అభ్యర్థులు, వారి అనుచరుల రాకపోకల నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణకు తీసుకోవాల్సిన ముందస్తు చర్యలను సమీక్షించారు. నామినేషన్ కేంద్రం వద్ద ఎలాంటి ఉద్రిక్తతలు చోటుచేసుకోకుండా తగిన బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు.

సమస్యాత్మక ప్రాంతాల్లో ఎస్పీ పర్యటన

తాడిపత్రిలోని నందలపాడు, ఓంశక్తి నగర్, శ్రీనివాసనగర్ ప్రాంతాల్లో ఎస్పీ పర్యటించి క్షేత్రస్థాయి పరిస్థితులను పరిశీలించారు. ఎన్నికల సమయంలో ఉద్రిక్తతలు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, రౌడీషీటర్లు, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తుల కదలికలపై నిరంతరం నిఘా ఉంచాలని పోలీసు అధికారులను ఆదేశించారు.

అనంతరం తాడిపత్రి డీఎస్పీ కార్యాలయంలో సబ్‌ డివిజన్ పరిధిలోని పోలీసు అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు పోలీసులు అనుసరించాల్సిన విధానాలు, పాటించాల్సిన నియమాలు, తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై దిశానిర్దేశం చేశారు. సమస్యాత్మక ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉంటూ, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు.

అల్లర్లు, గొడవలకు పాల్పడితే కఠిన చర్యలు

ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా పోలీసు శాఖ భద్రత కల్పిస్తుందని ఎస్పీ తెలిపారు. ఎన్నికల సమయంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడినా, అల్లర్లు, గొడవలు సృష్టించినా ఉపేక్షించేది లేదని, బాధ్యులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు ప్రజలు, రాజకీయ పార్టీలు, అభ్యర్థులు పోలీసు శాఖకు సహకరించాలని పిలుపునిచ్చారు.

ఈ పర్యటనలో తాడిపత్రి డీఎస్పీ ఎం.చంద్రశేఖర్‌తో పాటు సీఐలు క్రాంతికుమార్, ఆరోహణరావు, నారాయణరెడ్డి, శ్రీనివాసులు, నరేంద్రరెడ్డి తదితర పోలీసు అధికారులు పాల్గొన్నారు.

 

రిపోర్టర్ : మొయినుద్దీన్, అనంతపురం బ్యూరో, అనంతపురం.