BREAKING
106 డాలర్ల పైనే బ్రెంట్ క్రూడ్ ఆయిల్: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, సౌదీపై దాడులతో సరఫరా ఆందోళనలు! సింగరేణి కార్మికులకు లాభాల్లో 34 శాతం వాటా.. కాంట్రాక్ట్ కార్మికులకు రూ.5,500 బోనస్ 15 రోజుల్లో పెండింగ్ వారసత్వ ఉద్యోగాల సమస్య పరిష్కారానికి చర్యలు.. విస్కీ, సాల్మన్ నుంచి వార్షిక డేటా ఆడిట్‌ల వరకు: భారత్-యూకే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA)లో కీలక అంశాలివే! ప్రభుత్వ కాలనీలకు ప్రత్యేక నిధులతో మౌలిక సదుపాయాలు కల్పించాలి నియోజకవర్గ అభివృద్ధి నిధులను రూ.5 కోట్లకు పెంచాలి: సీపీఎం జిల్లా కార్యదర్శి జె.ఎన్.వి. గోపాలన్ మార్కెట్ యార్డులో 50 రూపాయలకే 26 కేజీల సన్న బియ్యం. సినిమాల్లోకి రావాలంటే నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్‌పై నటి నీతి టేలర్ సంచలన ఆరోపణలు! ఫేస్‌బుక్‌లో ఆన్‌లైన్ గేమింగ్ పెట్టుబడుల పేరుతో సైబర్ మోసం.. ముగ్గురు నిందితుల అరెస్ట్: ఎస్పీ స్నేహ మెహ్రా రైతాంగ వ్యతిరేక విధానాలపై పోరాటం..* *కేంద్ర మోడీ ప్రభుత్వం రైతాంగానికి ఇచ్చిన హామీల అమలు చేయాలి..* *మద్దతు ధరల గ్యారెంటీ చట్టం తీసుకురావాలి. రేషన్ కార్డుకు కేజీ 50రూపాయలతో 26 కేజీల సన్న బియ్యం మూడు గ్రామాల్లో పట్టాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ విద్యుత్ కోతలతో ఎండుతున్న ఆలుగడ్డ పంట.. జనరేటర్‌తో నీటి తడి పెడుతున్న రైతు.! తాడిపత్రిపై ఎస్పీ ప్రత్యేక దృష్టి ఎన్నికల భద్రతా ఏర్పాట్లపై క్షేత్రస్థాయి సమీక్ష.. సమస్యాత్మక ప్రాంతాల్లో పర్యటన హాలీవుడ్‌లో కలకలం.. పోలీసులపై దాడి కేసులో ప్రముఖ నటి సెల్మా బ్లెయిర్ అరెస్ట్! లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ రేలంగిలో 2,840 పట్టాదారు పాస్‌పుస్తకాల పంపిణీ

94వ ఎయిర్ఫోర్స్ దినోత్సవం మాజీ సైనికుల సంక్షేమానికి అండగా ఉంటాం.......ఎమ్మెల్యే ధూళిపాళ్ళ

Select Suryaa Now
94వ ఎయిర్ఫోర్స్ దినోత్సవం  మాజీ సైనికుల సంక్షేమానికి అండగా ఉంటాం.......ఎమ్మెల్యే ధూళిపాళ్ళ

పొన్నూరు పట్టణం ఇటుకంపాడు రోడ్ లోని  పొన్నూరు ఎక్స్-సర్వీస్‌మెన్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో 94వ ఎయిర్‌ఫోర్స్ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమనికి   ముఖ్యఅతిథిగా  ఎమ్మెల్యే ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్  పాల్గొన్నారు. ముందుగా దేశ రక్షణ కోసం ప్రాణాలర్పించిన అమరవీరులకు నివాళులర్పించారు
ఈ సందర్భంగా ఎమ్మెల్యే నరేంద్ర కుమార్  మాట్లాడుతూ దేశ రక్షణ కోసం తమ జీవితాలను అంకితం చేసిన మాజీ సైనికులకు వారి కుటుంబాలకు సేవ చేయడం తమ బాధ్యతగా భావిస్తున్నామని తెలిపారు.
మాజీ సైనికుల పెన్షన్లు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ఇతర సమస్యల పరిష్కారానికి తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని హామీ ఇచ్చారు.సామాజిక సేవా కార్యక్రమాల్లో పొన్నూరు ఎక్స్-సర్వీస్‌మెన్ వెల్ఫేర్ సొసైటీ చురుగ్గా పాల్గొనడం అభినందనీయమన్నారు.
మాజీ సైనికుల అభ్యర్థన మేరకు పొన్నూరులోని టిడ్కో ఇళ్ల సమీపంలో ఆర్మీ రన్ క్యాంటీన్ ఏర్పాటుకు స్థలం కేటాయించేందుకు చర్యలు తీసుకున్నామని, ఈ సందర్భంగా అంగీకార పత్రాలను అందజేసినట్లు వెల్లడించారుతొలుత మూడేళ్లపాటు స్థలం కేటాయించి అనంతరం దీర్ఘకాలిక లీజు కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిస్తామని తెలిపారు ఈ క్యాంటీన్ పొన్నూరు పరిసర ప్రాంతాలతో పాటు బాపట్ల ప్రాంత మాజీ సైనికులకు కూడాఉపయోగపడుతుందని పేర్కొన్నారుపట్టణ అభివృద్ధిలో మాజీ సైనికులు భాగస్వాములు కావాలని తమసమస్యలను తన దృష్టికి తీసుకువస్తే పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో విశిష్ట సేవా పథక గ్రహీత వైస్ అడ్మిరల్ సుభానీ  కల్నల్ రమేష్  మున్సిపల్ కమిషనర్  ఎం.రమేష్  బాబు మాజీ సైనికులు సొసైటీ ప్రతినిధులు తదితరులు భారీ ఎత్తున పాల్గొన్నారు.

పొన్నూరు నేటి దినపత్రిక సూర్య రిపోర్టర్ :-శిలార్