BREAKING
మార్కెట్ యార్డులో 50 రూపాయలకే 26 కేజీల సన్న బియ్యం. సినిమాల్లోకి రావాలంటే నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్‌పై నటి నీతి టేలర్ సంచలన ఆరోపణలు! ఫేస్‌బుక్‌లో ఆన్‌లైన్ గేమింగ్ పెట్టుబడుల పేరుతో సైబర్ మోసం.. ముగ్గురు నిందితుల అరెస్ట్: ఎస్పీ స్నేహ మెహ్రా రైతాంగ వ్యతిరేక విధానాలపై పోరాటం..* *కేంద్ర మోడీ ప్రభుత్వం రైతాంగానికి ఇచ్చిన హామీల అమలు చేయాలి..* *మద్దతు ధరల గ్యారెంటీ చట్టం తీసుకురావాలి. రేషన్ కార్డుకు కేజీ 50రూపాయలతో 26 కేజీల సన్న బియ్యం మూడు గ్రామాల్లో పట్టాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ విద్యుత్ కోతలతో ఎండుతున్న ఆలుగడ్డ పంట.. జనరేటర్‌తో నీటి తడి పెడుతున్న రైతు.! తాడిపత్రిపై ఎస్పీ ప్రత్యేక దృష్టి ఎన్నికల భద్రతా ఏర్పాట్లపై క్షేత్రస్థాయి సమీక్ష.. సమస్యాత్మక ప్రాంతాల్లో పర్యటన హాలీవుడ్‌లో కలకలం.. పోలీసులపై దాడి కేసులో ప్రముఖ నటి సెల్మా బ్లెయిర్ అరెస్ట్! లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ రేలంగిలో 2,840 పట్టాదారు పాస్‌పుస్తకాల పంపిణీ జనగణన–2027 ప్రక్రియను పారదర్శకంగా, గడువులోగా పూర్తి చేయాలి: అదనపు కలెక్టర్ వెంకటాచారి ప్రముఖ సీరియల్ నటి ఐశ్వర్య పిస్సే విడాకుల ప్రకటన.. భర్తతో విడిపోయినట్లు వెల్లడి! పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదుకు అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలి: తహసీల్దార్ విజయ్ కుమార్ తమిళనాడు రాజకీయాల్లోకి లేడీ సూపర్ స్టార్ నయనతార ఎంట్రీ.. రూమర్లపై స్పందించిన భర్త విఘ్నేశ్ శివన్!

కరీంనగర్ జిల్లాలో ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

Select Suryaa Now
కరీంనగర్ జిల్లాలో ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

 

 సూర్య కరీంనగర్: కరీంనగర్ జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ పరిధిలో జాతీయ ఆరోగ్య మిషన్ (NHM) కింద వివిధ కార్యక్రమాల్లో ఖాళీగా ఉన్న కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి తెలిపారు. ప్రభుత్వ నిబంధనలు, మెరిట్, రోస్టర్ విధానం, రిజర్వేషన్ నిబంధనలు, ప్రెసిడెన్షియల్ ఆర్డర్–2018 ప్రకారం నియామకాలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. అర్హులైన అభ్యర్థులు విద్యార్హతల ధ్రువపత్రాలు, కుల ధ్రువీకరణ పత్రం, ఇతర అవసరమైన ధ్రువపత్రాల స్వీయ ధ్రువీకరించిన ప్రతులతో దరఖాస్తులను జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి కార్యాలయం, కరీంనగర్‌లో నేరుగా లేదా రిజిస్టర్డ్ పోస్టు ద్వారా సమర్పించవచ్చు. దరఖాస్తుల స్వీకరణ అక్టోబర్ 12న ప్రారంభం కాగా, అక్టోబర్ 24వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. పోస్టుల వివరాలు, అర్హతలు, దరఖాస్తు విధానం తదితర పూర్తి సమాచారాన్ని కరీంనగర్ జిల్లా అధికారిక వెబ్‌సైట్ https://karimnagar.telangana.gov.in/ ద్వారా తెలుసుకోవచ్చని అధికారులు సూచించారు.