BREAKING
కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైంది-మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి యూట్యూబ్‌లో రికార్డులు సృష్టిస్తున్న 'రణబాలి' కోబలి సాంగ్.. 20 మిలియన్లకు పైగా వ్యూస్‌తో దూకుడు! 94వ ఎయిర్ఫోర్స్ దినోత్సవం మాజీ సైనికుల సంక్షేమానికి అండగా ఉంటాం.......ఎమ్మెల్యే ధూళిపాళ్ళ 'రామాయణ' నుంచి సంచలన అప్‌డేట్.. జటాయువు పాత్రలో ప్రముఖ నటుడు అనుపమ్ ఖేర్! కరీంనగర్ జిల్లాలో ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం అద్దంకిలో విశ్రాంత ఉద్యోగుల సంఘం 42వ ఆవిర్భావ దినోత్సవం. జగన్మాత దివ్యదర్శనంతో పులకించిన దర్శకుడు బోయపాటి శ్రీను 'ఖలిఫా' బాక్సాఫీస్ ఫలితంపై దర్శకుడు వైశాఖ్ ఆసక్తికర స్పందన.. పృథ్వీరాజ్ సుకుమారన్‌పై కక్షగట్టడం వల్లే ఫ్లాప్ అంటూ పోస్ట్ వైరల్! కావలి చైర్మన్ అభ్యర్థిగా రాజ్ కుమార్ చెరదా? బాలికలకు హెచ్‌పీవీ టీకాతో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌కు అడ్డుకట్ట ఆస్కార్‌కు భారత్ అధికారిక ఎంట్రీగా మరాఠీ చిత్రం 'గొంధళ్'.. నిజంగానే ఆ స్థాయి అర్హత ఉందా? కూటమిలో సీట్ల లొల్లి-తేలని పంచాయితీ -మేయర్, ఛైర్మన్ సీట్లపై పవన్ సీరియస్ -రెండు గంటల పాటు చంద్రబాబు, మనోహర్, మాధవ్ మంతనాలు -పల్లా శ్రీనివాస్‌కు అప్పగింత కుందుర్పి ఎం జె పి బాలుర వసతి గృహంలో ఎమ్మెల్యే సహకారంతో నీటి సమస్యకు పరిష్కారం. 'కాఫీ విత్ కరణ్' సీజన్ 9.. సల్మాన్ ఖాన్‌ను అదే ప్రశ్న అడిగిన కరణ్ జోహార్! విద్యుత్ షాక్ తో రైతు జయరామిరెడ్డి మృతి

స్థానిక సంస్థల ఎన్నికలు సజావుగా నిర్వహించాలి

Select Suryaa Now
స్థానిక సంస్థల ఎన్నికలు సజావుగా నిర్వహించాలి

నెల్లూరు సిటీ,మేజర్ న్యూస్ :    నెల్లూరు నగర కార్పొరేషన్ ఎన్నికలతో పాటు ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలను సజావుగా నిర్వహించాలని కోరుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జిల్లా కలెక్టర్‌ను కలిశారు. ఈ మేరకు ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అంశాలను ప్రస్తావిస్తూ వినతిపత్రం అందజేశారు. మాజీ మంత్రి, ఉమ్మడి నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు, సర్వేపల్లి నియోజకవర్గ ఇన్‌చార్జి కాకాణి గోవర్ధన్ రెడ్డి, ఎమ్మెల్సీ, నెల్లూరు సిటీ నియోజకవర్గ వైసీపీ ఇన్‌చార్జి చంద్రశేఖర్ రెడ్డి, నెల్లూరు రూరల్ ఇన్‌చార్జి, నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయకుమార్ రెడ్డి, గూడూరు నియోజకవర్గ వైసీపీ ఇన్‌చార్జి బూదూరు గురవయ్యతో పాటు పలువురు పార్టీ నాయకులు జిల్లా కలెక్టర్‌ను కలిశారు. నెల్లూరు నగర కార్పొరేషన్ ఎన్నికలతో పాటు ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా, ప్రశాంతంగా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా జరిగేలా చర్యలు తీసుకోవాలని వారు కోరినట్లు తెలిపారు. ఎన్నికల నిర్వహణపై వినతి  జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు చేపట్టి, ఎన్నికల ప్రక్రియ సజావుగా జరిగేలా చూడాలని వైసీపీ నేతలు విజ్ఞప్తి చేశారు. అనంతరం పార్టీ నాయకులు మీడియాతో మాట్లాడారు.