BREAKING
ప్రభుత్వ కాలనీలకు ప్రత్యేక నిధులతో మౌలిక సదుపాయాలు కల్పించాలి నియోజకవర్గ అభివృద్ధి నిధులను రూ.5 కోట్లకు పెంచాలి: సీపీఎం జిల్లా కార్యదర్శి జె.ఎన్.వి. గోపాలన్ మార్కెట్ యార్డులో 50 రూపాయలకే 26 కేజీల సన్న బియ్యం. సినిమాల్లోకి రావాలంటే నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్‌పై నటి నీతి టేలర్ సంచలన ఆరోపణలు! ఫేస్‌బుక్‌లో ఆన్‌లైన్ గేమింగ్ పెట్టుబడుల పేరుతో సైబర్ మోసం.. ముగ్గురు నిందితుల అరెస్ట్: ఎస్పీ స్నేహ మెహ్రా రైతాంగ వ్యతిరేక విధానాలపై పోరాటం..* *కేంద్ర మోడీ ప్రభుత్వం రైతాంగానికి ఇచ్చిన హామీల అమలు చేయాలి..* *మద్దతు ధరల గ్యారెంటీ చట్టం తీసుకురావాలి. రేషన్ కార్డుకు కేజీ 50రూపాయలతో 26 కేజీల సన్న బియ్యం మూడు గ్రామాల్లో పట్టాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ విద్యుత్ కోతలతో ఎండుతున్న ఆలుగడ్డ పంట.. జనరేటర్‌తో నీటి తడి పెడుతున్న రైతు.! తాడిపత్రిపై ఎస్పీ ప్రత్యేక దృష్టి ఎన్నికల భద్రతా ఏర్పాట్లపై క్షేత్రస్థాయి సమీక్ష.. సమస్యాత్మక ప్రాంతాల్లో పర్యటన హాలీవుడ్‌లో కలకలం.. పోలీసులపై దాడి కేసులో ప్రముఖ నటి సెల్మా బ్లెయిర్ అరెస్ట్! లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ రేలంగిలో 2,840 పట్టాదారు పాస్‌పుస్తకాల పంపిణీ జనగణన–2027 ప్రక్రియను పారదర్శకంగా, గడువులోగా పూర్తి చేయాలి: అదనపు కలెక్టర్ వెంకటాచారి ప్రముఖ సీరియల్ నటి ఐశ్వర్య పిస్సే విడాకుల ప్రకటన.. భర్తతో విడిపోయినట్లు వెల్లడి! పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదుకు అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలి: తహసీల్దార్ విజయ్ కుమార్

కూటమిలో సీట్ల లొల్లి-తేలని పంచాయితీ -మేయర్, ఛైర్మన్ సీట్లపై పవన్ సీరియస్ -రెండు గంటల పాటు చంద్రబాబు, మనోహర్, మాధవ్ మంతనాలు -పల్లా శ్రీనివాస్‌కు అప్పగింత

Select Suryaa Now
కూటమిలో సీట్ల లొల్లి-తేలని పంచాయితీ -మేయర్, ఛైర్మన్ సీట్లపై పవన్ సీరియస్  -రెండు గంటల పాటు చంద్రబాబు, మనోహర్, మాధవ్ మంతనాలు  -పల్లా శ్రీనివాస్‌కు అప్పగింత

ఎడ్యుకేషన్ స్టాఫ్ రిపోర్టర్ : స్థానిక సంస్థల ఎన్నికల సమయం దగ్గరపడుతున్నా కూటమిలో సీట్ల పంచాయితీ మాత్రం ఇంకా కొలిక్కి రావడం లేదు. టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య సీట్ల సర్దుబాటుపై ప్రతిష్టంభన కొనసాగుతోంది. ముఖ్యంగా కీలకమైన మేయర్, మున్సిపల్ ఛైర్మన్ సీట్ల విషయంలో జనసేన గట్టి పట్టుబడుతున్నట్లు విశ్వసనీయ సమాచారం.

అగ్రనేతలు సుదీర్ఘ భేటీ-హై టెన్షన్

సీటు సర్దుబాటుపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నివాసంలో జనసేన సీనియర్ నేత, మంత్రి నాదెండ్ల మనోహర్, బీజేపీ నేత మాధవ్‌తో దాదాపు రెండు గంటలకు పైగా సుదీర్ఘ చర్చలు జరిపారు. పలు కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో తమకు మేయర్, ఛైర్మన్ పదవులు కేటాయించాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. పవన్ ప్రతిపాదనలను మనోహర్ ద్వారా చంద్రబాబుకు చేరవేయగా, వాటి సాధ్యాసాధ్యాలపై సీఎం చంద్రబాబు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.

సీట్లుపై కూటమిలో ఉత్కంఠ

టీడీపీ అన్ని స్థానాల్లో బలంగా ఉందని భావిస్తుండగా, జనసేన తమ బలం ఉన్న చోట్ల పట్టుబడుతుండటంతో పంచాయితీ తేలడం లేదు. బీజేపీ కూడా తన వాటా కోసం ప్రయత్నిస్తోంది. స్థానిక ఎన్నికల్లో కూటమి ఐక్యంగా వెళ్తుందా? విడివిడిగా పోటీ చేస్తుందా? అనే దానిపై తుది నిర్ణయం ఇంకా రాలేదు. దీంతో కింది స్థాయి నాయకులు, కార్యకర్తల్లో ఉత్కంఠ నెలకొంది.