నిషార్ అహమ్మద్ కుటుంబాన్ని పరామర్శించిన నంద్యాల జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్
సూర్య, నంద్యాల బ్యూరో:నంద్యాల పట్టణంలోని విసి కాలనీకి చెందిన
నిషార్ అహమ్మద్ కుటుంబాన్ని నంద్యాల జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ పరామర్శించారు. నిషార్ అహమ్మద్ గత కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న ఆయన భౌతికదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. నిషార్ అహమ్మద కుటుంబసభ్యులను పరామర్శించారు. కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఆయన వెంట వార్డు ఇంచార్జి ఆహమ్మద్ హుస్సేన్ (చూరి), హారున్ బేగ్ టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.
*మధుబాబు, సూర్య బ్యూరో ఇంచార్జి, నంద్యాల జిల్లా*