BREAKING
రాష్ట్రస్థాయి ఖోఖో క్రీడాకారులకు ప్రోత్సాహం-బియ్యం బస్తా, పండ్ల పంపిణీ-యువజన కాంగ్రెస్ నాయకుడు కడారి విక్రమ్ 'నా వైఫ్ మిస్సింగ్' నుంచి మనసును హత్తుకునే లిరికల్ సాంగ్.. అక్టోబర్ 22 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్! ఓకే బందు వర్గానికి పదవులా.. మున్నూరు కాపు సంఘం మూడు ముక్కలు కావడానికి కారణం మీరు కాదా... విలేకరుల సమావేశంలో మున్నూరు కాపు సంఘం రాష్ట్ర నాయకులు శెట్టి రంగారావు, నగర అధ్యక్షులు రాపర్తి శరత్ ఎన్నారై వాసవి ఫౌండేషన్ సహకారంతో కడవెరుగు గ్రామంలో నూతన వాటర్ ప్లాంట్ ప్రారంభం జెడ్పిటిసి ఎంపిటిసి ఎన్నికలపై చర్చ. ఘనంగా మాజీ స్పీకర్ సిరికొండ జన్మదిన వేడుకలు కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైంది-మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి యూట్యూబ్‌లో రికార్డులు సృష్టిస్తున్న 'రణబాలి' కోబలి సాంగ్.. 20 మిలియన్లకు పైగా వ్యూస్‌తో దూకుడు! 94వ ఎయిర్ఫోర్స్ దినోత్సవం మాజీ సైనికుల సంక్షేమానికి అండగా ఉంటాం.......ఎమ్మెల్యే ధూళిపాళ్ళ 'రామాయణ' నుంచి సంచలన అప్‌డేట్.. జటాయువు పాత్రలో ప్రముఖ నటుడు అనుపమ్ ఖేర్! కరీంనగర్ జిల్లాలో ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం అద్దంకిలో విశ్రాంత ఉద్యోగుల సంఘం 42వ ఆవిర్భావ దినోత్సవం. జగన్మాత దివ్యదర్శనంతో పులకించిన దర్శకుడు బోయపాటి శ్రీను 'ఖలిఫా' బాక్సాఫీస్ ఫలితంపై దర్శకుడు వైశాఖ్ ఆసక్తికర స్పందన.. పృథ్వీరాజ్ సుకుమారన్‌పై కక్షగట్టడం వల్లే ఫ్లాప్ అంటూ పోస్ట్ వైరల్! కావలి చైర్మన్ అభ్యర్థిగా రాజ్ కుమార్ చెరదా?

సౌర విద్యుత్‌లో జిల్లా అగ్రస్థానంలో తణుకు 2,110 కుటుంబాలకు లబ్ధి.. 6.7 మెగావాట్ల సౌర విద్యుత్ సామర్థ్యం రూ.17 కోట్ల మేర ఆర్థిక ప్రయోజనం పర్యావరణ పరిరక్షణకు సౌరశక్తే ప్రత్యామ్నాయం: ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ

Select Suryaa Now
సౌర విద్యుత్‌లో జిల్లా అగ్రస్థానంలో తణుకు  2,110 కుటుంబాలకు లబ్ధి.. 6.7 మెగావాట్ల సౌర విద్యుత్ సామర్థ్యం  రూ.17 కోట్ల మేర ఆర్థిక ప్రయోజనం  పర్యావరణ పరిరక్షణకు సౌరశక్తే ప్రత్యామ్నాయం: ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ

తణుకు, సూర్య న్యూస్ : సౌర విద్యుత్ వినియోగంలో తణుకు నియోజకవర్గం పశ్చిమగోదావరి జిల్లాలో ప్రథమ స్థానంలో నిలిచిందని ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ వెల్లడించారు. నియోజకవర్గవ్యాప్తంగా ఇప్పటివరకు 2,110 కుటుంబాలు తమ ఇళ్లపై సోలార్ విద్యుత్ వ్యవస్థలను ఏర్పాటు చేసుకున్నాయని, వీటి ద్వారా 6.7 మెగావాట్ల సౌర విద్యుత్ సామర్థ్యం అందుబాటులోకి వచ్చిందని తెలిపారు. ఈ పథకం ద్వారా ప్రజలకు సుమారు రూ.17 కోట్ల మేర ఆర్థిక ప్రయోజనం చేకూరిందన్నారు.మంగళవారం తణుకు మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన పీఎం సూర్య ఘర్ సేవా సేతు అభియాన్ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంప్రదాయ విద్యుత్ వనరులపై ఆధారపడటాన్ని తగ్గించడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు సౌర విద్యుత్ వినియోగం ఎంతగానో దోహదపడుతుందన్నారు.ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన సామాన్య, మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థికంగా ఊరటనిస్తోందని పేర్కొన్నారు. ఇంటి పైకప్పులపై సోలార్ ప్యానెళ్ల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న రాయితీలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.సౌర విద్యుత్ వినియోగంలో జిల్లా స్థాయిలో తణుకు అగ్రస్థానంలో నిలవడం అభినందనీయమని, ఈ విజయాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. పథకంపై ప్రతి ఇంటికీ అవగాహన కల్పించేలా అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు. విద్యుత్ బిల్లుల భారం తగ్గించుకోవడంతో పాటు స్వచ్ఛమైన ఇంధన వినియోగాన్ని పెంపొందించేందుకు ప్రతి కుటుంబం సౌరశక్తి వైపు అడుగులు వేయాలని ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పిలుపునిచ్చారు.

రిపోర్టర్: అనుకుమార్..తణుకు పశ్చిమగోదావరి జిల్లా,