BREAKING
రాష్ట్రస్థాయి ఖోఖో క్రీడాకారులకు ప్రోత్సాహం-బియ్యం బస్తా, పండ్ల పంపిణీ-యువజన కాంగ్రెస్ నాయకుడు కడారి విక్రమ్ 'నా వైఫ్ మిస్సింగ్' నుంచి మనసును హత్తుకునే లిరికల్ సాంగ్.. అక్టోబర్ 22 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్! ఓకే బందు వర్గానికి పదవులా.. మున్నూరు కాపు సంఘం మూడు ముక్కలు కావడానికి కారణం మీరు కాదా... విలేకరుల సమావేశంలో మున్నూరు కాపు సంఘం రాష్ట్ర నాయకులు శెట్టి రంగారావు, నగర అధ్యక్షులు రాపర్తి శరత్ ఎన్నారై వాసవి ఫౌండేషన్ సహకారంతో కడవెరుగు గ్రామంలో నూతన వాటర్ ప్లాంట్ ప్రారంభం జెడ్పిటిసి ఎంపిటిసి ఎన్నికలపై చర్చ. ఘనంగా మాజీ స్పీకర్ సిరికొండ జన్మదిన వేడుకలు కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైంది-మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి యూట్యూబ్‌లో రికార్డులు సృష్టిస్తున్న 'రణబాలి' కోబలి సాంగ్.. 20 మిలియన్లకు పైగా వ్యూస్‌తో దూకుడు! 94వ ఎయిర్ఫోర్స్ దినోత్సవం మాజీ సైనికుల సంక్షేమానికి అండగా ఉంటాం.......ఎమ్మెల్యే ధూళిపాళ్ళ 'రామాయణ' నుంచి సంచలన అప్‌డేట్.. జటాయువు పాత్రలో ప్రముఖ నటుడు అనుపమ్ ఖేర్! కరీంనగర్ జిల్లాలో ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం అద్దంకిలో విశ్రాంత ఉద్యోగుల సంఘం 42వ ఆవిర్భావ దినోత్సవం. జగన్మాత దివ్యదర్శనంతో పులకించిన దర్శకుడు బోయపాటి శ్రీను 'ఖలిఫా' బాక్సాఫీస్ ఫలితంపై దర్శకుడు వైశాఖ్ ఆసక్తికర స్పందన.. పృథ్వీరాజ్ సుకుమారన్‌పై కక్షగట్టడం వల్లే ఫ్లాప్ అంటూ పోస్ట్ వైరల్! కావలి చైర్మన్ అభ్యర్థిగా రాజ్ కుమార్ చెరదా?

సర్వీసు రోడ్డు నిర్మాణం చేపట్టాలని కోరుతూ గ్రామస్తులు జాతీయ రహదారి 563పై ధర్నా

Select Suryaa Now
సర్వీసు రోడ్డు నిర్మాణం చేపట్టాలని కోరుతూ గ్రామస్తులు జాతీయ రహదారి 563పై ధర్నా

సూర్య మానకొండూరు: కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలంలోని ఈదులగట్టేపల్లి గ్రామానికిసర్వీసు రోడ్డు నిర్మాణం చేపట్టాలని కోరుతూ గ్రామస్తులు జాతీయ రహదారి 563పై ధర్నా  కార్యక్రమం చేపట్టారు సుమారు గంటపాటు చేసిన ధర్నాతో ఇరువైపుల వాహనాలు ఆగిపోయాయి సమాచారం తెలుసుకున్న కరీంనగర్ రూరల్ ఏసీబీ విజయకుమార్ స్థానిక సీఐ శ్రీలత ఎస్సై తిరుపతి పోలీస్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని ఆందోళన విరమింపజేయాలని కోరారు. కలెక్టర్ జాతీయ రహదారి అధికారులు కాంట్రాక్టర్ వచ్చేంతవరకు ధర్నాను విరమించేది లేదని కూర్చున్నారు అనంతరం తహశీల్దార్ విజయకుమార్ సంఘటన స్థలానికి చేరుకొని ఆందోళనకారులతో చర్చించారు. అనంతరం మాజీ ఎంపీ బోయిన్పల్లి వినోద్ కుమార్ ధర్నా చేపడుతున్న గ్రామస్తులతో చర్చించి అండర్పాస్
పాటు సర్వీస్ రోడ్ నిర్మాణానికి సంబంధిత అధికారులతో చర్చించి నిర్మాణం అయ్యేలా సహకరిస్తానని గ్రామస్తులకు హామీ ఇచ్చారు. అనంతరం గ్రామ సర్పంచ్ మీసా సత్యనారాయణ మాట్లాడుతూ మానకొండూరు మండలం గట్టెపల్లి గ్రామానికి ఎన్‌హెచ్ 563 నేషనల్ హైవే అథారిటీ వారు ఎలాంటి సర్వీసు రోడ్డు ఇవ్వకుండా తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని గ్రామ సర్పంచ్ సత్యనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. రాత్రి సమయాల్లో దొంగల్లా వచ్చి, ఏసీబీ ఆధ్వర్యంలో వంద మంది పోలీసులతో రాత్రి 12 గంటలకు వచ్చి ఉదయం 4 గంటల లోపే రోడ్డును పూర్తి చేసుకున్నారని తెలిపారు.గ్రామానికి ఎలాంటి సర్వీసు రోడ్డు ఇవ్వకపోవడంతో పాటు కనెక్టివిటీ కూడా లేదని, దీనివల్ల రైతులు, ఉద్యోగస్తులు, ప్రైవేట్ ఉద్యోగులు, కూలీలు, మహిళలు ఆస్పత్రులకు వెళ్లడానికి, పిల్లలు చదువుకోవడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సర్పంచ్  పేర్కొన్నారు.గత ఆరు నెలలుగా సరైన రోడ్డు లేక రాంగ్ సైడ్ నుంచి రావాల్సి వస్తోందని, దీనివల్ల తరచూ యాక్సిడెంట్లు అవుతూ తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నామని సర్పంచ్ సత్యనారాయణ తెలిపారు. ఈ ధర్నాలనో గ్రామస్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు...