BREAKING
కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైంది-మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి యూట్యూబ్‌లో రికార్డులు సృష్టిస్తున్న 'రణబాలి' కోబలి సాంగ్.. 20 మిలియన్లకు పైగా వ్యూస్‌తో దూకుడు! 94వ ఎయిర్ఫోర్స్ దినోత్సవం మాజీ సైనికుల సంక్షేమానికి అండగా ఉంటాం.......ఎమ్మెల్యే ధూళిపాళ్ళ 'రామాయణ' నుంచి సంచలన అప్‌డేట్.. జటాయువు పాత్రలో ప్రముఖ నటుడు అనుపమ్ ఖేర్! కరీంనగర్ జిల్లాలో ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం అద్దంకిలో విశ్రాంత ఉద్యోగుల సంఘం 42వ ఆవిర్భావ దినోత్సవం. జగన్మాత దివ్యదర్శనంతో పులకించిన దర్శకుడు బోయపాటి శ్రీను 'ఖలిఫా' బాక్సాఫీస్ ఫలితంపై దర్శకుడు వైశాఖ్ ఆసక్తికర స్పందన.. పృథ్వీరాజ్ సుకుమారన్‌పై కక్షగట్టడం వల్లే ఫ్లాప్ అంటూ పోస్ట్ వైరల్! కావలి చైర్మన్ అభ్యర్థిగా రాజ్ కుమార్ చెరదా? బాలికలకు హెచ్‌పీవీ టీకాతో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌కు అడ్డుకట్ట ఆస్కార్‌కు భారత్ అధికారిక ఎంట్రీగా మరాఠీ చిత్రం 'గొంధళ్'.. నిజంగానే ఆ స్థాయి అర్హత ఉందా? కూటమిలో సీట్ల లొల్లి-తేలని పంచాయితీ -మేయర్, ఛైర్మన్ సీట్లపై పవన్ సీరియస్ -రెండు గంటల పాటు చంద్రబాబు, మనోహర్, మాధవ్ మంతనాలు -పల్లా శ్రీనివాస్‌కు అప్పగింత కుందుర్పి ఎం జె పి బాలుర వసతి గృహంలో ఎమ్మెల్యే సహకారంతో నీటి సమస్యకు పరిష్కారం. 'కాఫీ విత్ కరణ్' సీజన్ 9.. సల్మాన్ ఖాన్‌ను అదే ప్రశ్న అడిగిన కరణ్ జోహార్! విద్యుత్ షాక్ తో రైతు జయరామిరెడ్డి మృతి

దసరా వేడుకలకు మాజీ మంత్రి హరీష్ రావు కు ఆహ్వానం

Select Suryaa Now
దసరా వేడుకలకు మాజీ మంత్రి హరీష్ రావు కు ఆహ్వానం

అమీన్‌పూర్, ; విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని అమీన్‌పూర్ గ్రామ పరిధిలోని పెద్ద చెరువు వద్ద నిర్వహించనున్న రావణ దహన మహోత్సవానికి మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావును అమీన్‌పూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి మర్యాదపూర్వకంగా ఆహ్వానించారు.అమీన్‌పూర్ గ్రామ పెద్దలతో కలిసి పాండురంగారెడ్డి మాజీ మంత్రిని కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. పెద్ద చెరువు ప్రాంగణంలో తమ ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా నిర్వహించనున్న దసరా సంబరాలు, రావణ దహన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి విజయవంతం చేయాలని కోరారు. ఇందుకు మాజీ మంత్రి సానుకూలంగా స్పందించినట్లు నాయకులు తెలిపారు.ఈ కార్యక్రమంలో అమీన్‌పూర్ మాజీ కౌన్సిలర్ కృష్ణ, బిజిలి రాజు, అమీన్‌పూర్ గ్రామ పెద్దలు, ఉపేందర్ రెడ్డి, కొల్లూరి గోపాల్, కొల్లూరు యాదగిరి, హరినాథ్, స్థానిక ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.