BREAKING
రాష్ట్రస్థాయి ఖోఖో క్రీడాకారులకు ప్రోత్సాహం-బియ్యం బస్తా, పండ్ల పంపిణీ-యువజన కాంగ్రెస్ నాయకుడు కడారి విక్రమ్ 'నా వైఫ్ మిస్సింగ్' నుంచి మనసును హత్తుకునే లిరికల్ సాంగ్.. అక్టోబర్ 22 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్! ఓకే బందు వర్గానికి పదవులా.. మున్నూరు కాపు సంఘం మూడు ముక్కలు కావడానికి కారణం మీరు కాదా... విలేకరుల సమావేశంలో మున్నూరు కాపు సంఘం రాష్ట్ర నాయకులు శెట్టి రంగారావు, నగర అధ్యక్షులు రాపర్తి శరత్ ఎన్నారై వాసవి ఫౌండేషన్ సహకారంతో కడవెరుగు గ్రామంలో నూతన వాటర్ ప్లాంట్ ప్రారంభం జెడ్పిటిసి ఎంపిటిసి ఎన్నికలపై చర్చ. ఘనంగా మాజీ స్పీకర్ సిరికొండ జన్మదిన వేడుకలు కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైంది-మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి యూట్యూబ్‌లో రికార్డులు సృష్టిస్తున్న 'రణబాలి' కోబలి సాంగ్.. 20 మిలియన్లకు పైగా వ్యూస్‌తో దూకుడు! 94వ ఎయిర్ఫోర్స్ దినోత్సవం మాజీ సైనికుల సంక్షేమానికి అండగా ఉంటాం.......ఎమ్మెల్యే ధూళిపాళ్ళ 'రామాయణ' నుంచి సంచలన అప్‌డేట్.. జటాయువు పాత్రలో ప్రముఖ నటుడు అనుపమ్ ఖేర్! కరీంనగర్ జిల్లాలో ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం అద్దంకిలో విశ్రాంత ఉద్యోగుల సంఘం 42వ ఆవిర్భావ దినోత్సవం. జగన్మాత దివ్యదర్శనంతో పులకించిన దర్శకుడు బోయపాటి శ్రీను 'ఖలిఫా' బాక్సాఫీస్ ఫలితంపై దర్శకుడు వైశాఖ్ ఆసక్తికర స్పందన.. పృథ్వీరాజ్ సుకుమారన్‌పై కక్షగట్టడం వల్లే ఫ్లాప్ అంటూ పోస్ట్ వైరల్! కావలి చైర్మన్ అభ్యర్థిగా రాజ్ కుమార్ చెరదా?

స్థానిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయానికి నంద్యాల న్యాయవాదులు కృషి చేయాలి: నంద్యాల జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్

Select Suryaa Now
స్థానిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయానికి నంద్యాల న్యాయవాదులు కృషి చేయాలి: నంద్యాల జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్

సూర్య, నంద్యాల బ్యూరో:నంద్యాల పట్టణంలో నిర్వహించిన తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్ సమావేశానికి ముఖ్య అతిథులుగా  తెలుగుదేశం పార్టీ నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి  ఫిరోజ్ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు ఫయాజ్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయానికి టీడీపీ లీగల్ సెల్ న్యాయవాదులు సమష్టిగా కృషి చేయాలని  ఫిరోజ్ తెలిపారు. ఎం ఎండీ ఫిరోజ్ మాట్లాడుతూ గత ఎన్నికల్లో నంద్యాలలో టీడీపీ అభ్యర్థి  ఫరూక్ భారీ మెజారిటీతో విజయం సాధించడంలో న్యాయవాదుల సహకారం కీలకమన్నారు. అదే స్ఫూర్తితో రాబోయే  స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి పార్టీ నాయకులు, కార్యకర్తలు, న్యాయవాదులు సమన్వయంతో పనిచేసి కూటమి  అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండీ ఫరూక్  న్యాయవాదుల సంక్షేమానికి ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న జూనియర్ కోర్టుల మంజూరు, సిబ్బంది నియామకం వంటి చర్యలు న్యాయవాదులకు ఎంతో ఉపయోగకరమన్నారు. న్యాయవాదుల రక్షణ చట్టం తీసుకురావడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని, కర్నూలులో హైకోర్టు ఏర్పాటు అంశం త్వరలో పూర్తి కానుందని ఫిరోజ్ తెలిపారు.ప్రజలకు న్యాయపరమైన అవగాహన కల్పించడంతో పాటు, వైసీపీ పార్టీ చేస్తున్న నీచ రాజకీయాలను ఎండకడుతూ పార్టీ బలోపేతానికి న్యాయవాదులు తమ వంతు బాధ్యత నిర్వర్తించాలని నాయకులు సూచించారు.రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ ఐక్యంగా ముందుకు సాగాలని ఎన్ఎండీ ఫయాజ్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మాజీ రాష్ట్ర కార్యదర్శి వెదుర్ల రామ చంద్రరావు, మార్క్ ఫెడ్ కార్పొరేషన్ డైరెక్టర్ తాతిరెడ్డి తులసిరెడ్డి, హుస్సేన్ భాష, ఖలీల్, డిఎన్ బాబు,ప్రసాద్ రెడ్డి, గొల్ల జయకృష్ణ,నటరాజ రావు, మద్దిలేటి, సాయిరాం రాయల్,బాలహాజీ మరియు  తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు
*మధుబాబు, సూర్య బ్యూరో ఇంచార్జి, నంద్యాల జిల్లా*