BREAKING
రాష్ట్రస్థాయి ఖోఖో క్రీడాకారులకు ప్రోత్సాహం-బియ్యం బస్తా, పండ్ల పంపిణీ-యువజన కాంగ్రెస్ నాయకుడు కడారి విక్రమ్ 'నా వైఫ్ మిస్సింగ్' నుంచి మనసును హత్తుకునే లిరికల్ సాంగ్.. అక్టోబర్ 22 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్! ఓకే బందు వర్గానికి పదవులా.. మున్నూరు కాపు సంఘం మూడు ముక్కలు కావడానికి కారణం మీరు కాదా... విలేకరుల సమావేశంలో మున్నూరు కాపు సంఘం రాష్ట్ర నాయకులు శెట్టి రంగారావు, నగర అధ్యక్షులు రాపర్తి శరత్ ఎన్నారై వాసవి ఫౌండేషన్ సహకారంతో కడవెరుగు గ్రామంలో నూతన వాటర్ ప్లాంట్ ప్రారంభం జెడ్పిటిసి ఎంపిటిసి ఎన్నికలపై చర్చ. ఘనంగా మాజీ స్పీకర్ సిరికొండ జన్మదిన వేడుకలు కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైంది-మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి యూట్యూబ్‌లో రికార్డులు సృష్టిస్తున్న 'రణబాలి' కోబలి సాంగ్.. 20 మిలియన్లకు పైగా వ్యూస్‌తో దూకుడు! 94వ ఎయిర్ఫోర్స్ దినోత్సవం మాజీ సైనికుల సంక్షేమానికి అండగా ఉంటాం.......ఎమ్మెల్యే ధూళిపాళ్ళ 'రామాయణ' నుంచి సంచలన అప్‌డేట్.. జటాయువు పాత్రలో ప్రముఖ నటుడు అనుపమ్ ఖేర్! కరీంనగర్ జిల్లాలో ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం అద్దంకిలో విశ్రాంత ఉద్యోగుల సంఘం 42వ ఆవిర్భావ దినోత్సవం. జగన్మాత దివ్యదర్శనంతో పులకించిన దర్శకుడు బోయపాటి శ్రీను 'ఖలిఫా' బాక్సాఫీస్ ఫలితంపై దర్శకుడు వైశాఖ్ ఆసక్తికర స్పందన.. పృథ్వీరాజ్ సుకుమారన్‌పై కక్షగట్టడం వల్లే ఫ్లాప్ అంటూ పోస్ట్ వైరల్! కావలి చైర్మన్ అభ్యర్థిగా రాజ్ కుమార్ చెరదా?

తణుకు నియోజకవర్గంలో 154 ఇళ్లకు మంజూరు.. మరో 1,029 ఇళ్లకు ప్రతిపాదనలు

Select Suryaa Now
తణుకు నియోజకవర్గంలో 154 ఇళ్లకు మంజూరు.. మరో 1,029 ఇళ్లకు ప్రతిపాదనలు

తణుకు, సూర్య న్యూస్ : ప్రతి పేద కుటుంబానికి సొంతింటి కలను సాకారం చేయడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ స్పష్టం చేశారు. అర్హులైన నిరుపేదలకు గృహ వసతి కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యతనిస్తోందన్నారు. మంగళవారం తణుకు మున్సిపల్ కార్యాలయంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై) పథకం కింద పట్టణానికి చెందిన 154 మంది లబ్ధిదారులకు గృహ నిర్మాణ మంజూరు పత్రాలను ఆయన అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాదాకృష్ణ మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ సహకారంతో పేదల గృహ నిర్మాణానికి అధిక ప్రాధాన్యత కల్పిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రానికి సుమారు నాలుగు లక్షల ఇళ్లను మంజూరు చేయడం గృహ నిర్మాణ రంగంలో కీలక ముందడుగని పేర్కొన్నారు.తణుకు నియోజకవర్గంలో సొంత స్థలాలు కలిగిన అర్హుల కోసం గ్రామీణ ప్రాంతంలో పీఎంఏవై పథకం కింద 1,029 ఇళ్ల మంజూరుకు ప్రతిపాదనలు పంపించామని, పట్టణ పరిధిలో పీఎంఏవై 2.0 అర్బన్ పథకం ద్వారా 154 ఇళ్లకు మంజూరు పత్రాలు అందజేశామని వివరించారు. గ్రామీణ ప్రాంత లబ్ధిదారులకు సైతం త్వరలో మంజూరు పత్రాలు అందించేలా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం నియోజకవర్గంలో వివిధ పథకాల కింద 1,062 ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయని తెలిపారు. వీటిలో గ్రామీణ ప్రాంతంలో పీఎంఏవై 1.0 కింద 911 ఇళ్లు, పీఎంఏవై గ్రామీణ్ కింద 99 ఇళ్లు, పట్టణంలో పీఎంఏవై 2.0 అర్బన్ కింద 52 ఇళ్లు ఉన్నాయన్నారు. గృహ నిర్మాణానికి సంబంధించి లబ్ధిదారుల ఖాతాల్లో రూ.6.54 కోట్ల నిధులు జమ చేసినట్లు పేర్కొన్నారు.

సంక్రాంతికి టిడ్కో ఇళ్ల పంపిణీ లక్ష్యం..…తణుకు పట్టణంలో ఏళ్లుగా పంపిణీకి నోచుకోని టిడ్కో ఇళ్ల సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టినట్లు ఎమ్మెల్యే రాధాకృష్ణ తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యానికి గురైన టిడ్కో గృహాల పునరుద్ధరణ పనులను తిరిగి ప్రారంభించామని, రాబోయే సంక్రాంతి నాటికి వాటిని లబ్ధిదారులకు అందించేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. సొంత స్థలాలు లేని నిరుపేదలకు భవిష్యత్తులో ఇళ్ల స్థలాలు సమకూర్చే దిశగా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోందన్నారు.గృహ నిర్మాణంతో పాటు మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యతనిస్తూ ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా అధికారులు కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రామ్‌కుమార్, కూటమి నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

.రిపోర్టర్.రాసాబత్తుల అనుకుమార్. ..తణుకు. పశ్చిమగోదావరి జిల్లా,