పేకాట స్థావరంపై టాస్క్ ఫోర్స్ పోలిసుల దాడి: ముగ్గురు అరెస్ట్
కొల్చారం ; కూల్చారం మండలం పోతన్‌శెట్టిపల్లి గ్రామంలోని హనుమాన్ ఫంక్షన్ హాల్ వద్ద రాత్రి పేకాట ఆడుతున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు మెదక్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడి నిర్వహించారు. ఈ దాడిలో పేకాట ఆడుతున్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి రూ.17,300 నగదు, మూడు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిలో కూల్చారం గ్రామానికి చెందిన సత్యనారాయణ, శేఖర్, నర్సింలు ఉన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి తదుపరి చట్టపరమైన చర్యలు చేపట్టారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు మాట్లాడుతూ.. జిల్లాలో పేకాట, జూదం వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. ఇలాంటి కార్యకలాపాలపై నిరంతరం నిఘా కొనసాగిస్తామని, సమాచారం అందిన వెంటనే దాడులు నిర్వహించి చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గ్రామాల్లో పేకాట లేదా ఇతర అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్లు తెలిస్తే ప్రజలు వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు, చట్టవిరుద్ధ కార్యకలాపాల నియంత్రణకు పోలీస్ శాఖ నిరంతరం కృషి చేస్తుందని ఎస్పీ తెలిపారు.