BREAKING
మూడు గ్రామాల్లో పట్టాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ విద్యుత్ కోతలతో ఎండుతున్న ఆలుగడ్డ పంట.. జనరేటర్‌తో నీటి తడి పెడుతున్న రైతు.! తాడిపత్రిపై ఎస్పీ ప్రత్యేక దృష్టి ఎన్నికల భద్రతా ఏర్పాట్లపై క్షేత్రస్థాయి సమీక్ష.. సమస్యాత్మక ప్రాంతాల్లో పర్యటన హాలీవుడ్‌లో కలకలం.. పోలీసులపై దాడి కేసులో ప్రముఖ నటి సెల్మా బ్లెయిర్ అరెస్ట్! లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ రేలంగిలో 2,840 పట్టాదారు పాస్‌పుస్తకాల పంపిణీ జనగణన–2027 ప్రక్రియను పారదర్శకంగా, గడువులోగా పూర్తి చేయాలి: అదనపు కలెక్టర్ వెంకటాచారి ప్రముఖ సీరియల్ నటి ఐశ్వర్య పిస్సే విడాకుల ప్రకటన.. భర్తతో విడిపోయినట్లు వెల్లడి! పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదుకు అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలి: తహసీల్దార్ విజయ్ కుమార్ తమిళనాడు రాజకీయాల్లోకి లేడీ సూపర్ స్టార్ నయనతార ఎంట్రీ.. రూమర్లపై స్పందించిన భర్త విఘ్నేశ్ శివన్! రాష్ట్రస్థాయి ఖోఖో క్రీడాకారులకు ప్రోత్సాహం-బియ్యం బస్తా, పండ్ల పంపిణీ-యువజన కాంగ్రెస్ నాయకుడు కడారి విక్రమ్ 'నా వైఫ్ మిస్సింగ్' నుంచి మనసును హత్తుకునే లిరికల్ సాంగ్.. అక్టోబర్ 22 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్! ఓకే బందు వర్గానికి పదవులా.. మున్నూరు కాపు సంఘం మూడు ముక్కలు కావడానికి కారణం మీరు కాదా... విలేకరుల సమావేశంలో మున్నూరు కాపు సంఘం రాష్ట్ర నాయకులు శెట్టి రంగారావు, నగర అధ్యక్షులు రాపర్తి శరత్ ఎన్నారై వాసవి ఫౌండేషన్ సహకారంతో కడవెరుగు గ్రామంలో నూతన వాటర్ ప్లాంట్ ప్రారంభం జెడ్పిటిసి ఎంపిటిసి ఎన్నికలపై చర్చ.

నగరాన్ని సుందరీకరణగా మారుస్తాం

Select Suryaa Now
నగరాన్ని సుందరీకరణగా మారుస్తాం

చిత్తూరు ప్రతినిధి మేజర్ న్యూస్: నగరంలో పలు వార్డుల్లో నూతనంగా నిర్మించిన సిమెంట్ రోడ్లను ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ ప్రారంభించారు. సోమవారం సాయంత్రం 9వ వార్డు లక్ష్మీ నగర్ కాలనీ ఎక్స్టెన్షన్ లో రూ.10 లక్షలతో నిర్మించిన సిమెంట్ రోడ్డును ప్రారంభించారు. అనంతరం ఇరువారం పరిధిలో.. వివిధ వీధుల్లో నగరపాలక సంస్థ, ఎంపీ నిధులు, ఐఓసీఎల్ సిఆర్ఎస్ నిధులు మొత్తంగా రూ.1.80 కోట్ల నిధులతో చేపట్టిన నాలుగు సిమెంట్ రోడ్లు, బరియల్ గ్రౌండ్ చాపెల్, వీధిలైట్లు, బోరు మోటారు, మినీ కమ్యూనిటీ హాల్ నిర్మాణాలకు భూమి పూజ, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. చిత్తూరు నగరంలో అభివృద్ధి పనులు వేగవంతం చేశామని, స్థానిక సంస్థల్లో ప్రజల మద్దతుతో రానున్న రోజుల్లో మరింతగా అభివృద్ధి పనులు చేస్తామని చెప్పారు. గడిచిన రెండేళ్లలో కూటమి పార్టీ ఆధ్వర్యంలో నగరంలోని అన్ని వార్డుల పరిధిలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు. అభివృద్ధిని చూసి కూటమి పార్టీ అభ్యర్థులకు ఓటు వేయాలని కోరారు. కార్యక్రమంలో.. క్లస్టర్, డివిజన్ ఇన్చార్జులు, మాజీ కార్పొరేటర్లు, స్థానిక కూటమి పార్టీల నాయకులు, తెదేపా కమిటీల సభ్యులు, కార్యకర్తలు పాల్గొన్నారు.