రూ. 13.50 కోట్లతో నందమూరి నగర్, వైఎస్సార్ నగర్‌లలో అభివృద్ధి మైనారిటీ మరియు న్యాయ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్
సూర్య, నంద్యాల బ్యూరో:నంద్యాల పట్టణ సమగ్ర అభివృద్ధే ధ్యేయంగా ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలతో ముందుకెళ్తోందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ తెలిపారు.
హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (హెచ్.ఏ.ఎమ్) పథకం కింద సుమారు రూ. 13.50 కోట్ల వ్యయంతో నందమూరి నగర్ మరియు వైఎస్సార్ నగర్ పరిధిలో చేపట్టనున్న పలు కీలక మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులకు మంత్రివర్యులు ఘనంగా శంకుస్థాపన చేశారు. మంత్రి ఫరూక్ మాట్లాడుతూ పట్టణవాసులకు మెరుగైన జీవన ప్రమాణాలు, ఆధునిక వసతులు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. నాణ్యమైన అంతర్గత, ప్రధాన రహదారుల నిర్మాణం, ట్రాఫిక్ నియంత్రణ మరియు అందాన్ని పెంచేలా సెంట్రల్ మీడియన్ల ఏర్పాటు ప్రజల భద్రత, రాత్రి వేళల్లో రాకపోకల సౌలభ్యం కోసం సెంట్రల్ స్ట్రీట్ లైటింగ్ వ్యవస్థ, ప్రజలు ఆహ్లాదకర వాతావరణం పొందేందుకు అధునాతన పార్కుల అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు వెల్లడించారు. పనుల్లో ఎలాంటి నాణ్యతా లోపాలు లేకుండా, నిర్దేశిత గడువులోగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సంబంధిత అధికారులను, కాంట్రాక్టర్లను మంత్రి ఆదేశించారు. నగరంలోని అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేసేందుకు నిరంతరం కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర యువ నాయకులు ఎన్ఎండి ఫయాజ్, నంద్యాల టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్, నంద్యాల మార్కెట్ యార్డ్ చైర్మన్ గుంటుపల్లి హరిబాబు, వార్డు ఇంచార్జి తాటికొండ బుగ్గ రాముడు, తాటికొండ మహేష్ , ప్రసాద్ రెడ్డి, గోవిందు నాయుడు , మాజీ కౌన్సిలర్ నాగార్జున, పద్మ, నారాయణ, సురేష్ రెడ్డి, కొమ్ము శ్రీహరి, సురేష్ , నంద్యాల మున్సిపల్ కమిషనర్ శేషన్న, ఎంఈ నాగభూషణం రెడ్డి మరియు స్థానిక ప్రజాప్రతినిధులు, మున్సిపల్ అధికారులు, ఇంజనీరింగ్ విభాగం అధికారులు, నాయకులు మరియు కాలనీవాసులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
మధుబాబు, సూర్య బ్యూరో ఇంచార్జి, నంద్యాల జిల్లా*