BREAKING
పాల్మాకుల్‌లో మహిళ అనుమానాస్పద మృతి దేవరగట్టు ఉత్సవాలను భక్తి భావంతో నిర్వహించుకోండి: కర్నూలు జిల్లా కలెక్టర్ ఏ .సిరి జనసేన ఇంటికి రాధా రామాయణంలో యశ్ లుక్‌పై ఆర్య బబ్బర్ సంచలన కామెంట్స్.. ఆదిపురుష్‌లో సైఫ్ నటన చాలా బాగుంది! ప్రభుత్వ ఉద్యోగులకు ఎన్ ఈ హెచ్ ఎస్ ద్వారా ఉచిత వైద్యం మంచిర్యాలలోని 16 ఆసుపత్రుల్లో పథకం అమలు.. సద్వినియోగం చేసుకోవాలి-టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు గడియారం శ్రీహరి చైనా, జపాన్‌లతోనే మా పోటీ నంద్యాల జిల్లా పరిషత్ సిఇఓగా బాధ్యతలు చేపట్టిన శివశంకర్ కోరుట్ల సీఐగా కొమ్ము తిరుపతి బాధ్యతల స్వీకరణ స్థానిక ఎన్నికలు టిడిపి సమాయత్తం.. సోషల్ మీడియా ట్రోల్స్‌పై నటి మృణాల్ ఠాకూర్ సంచలన వ్యాఖ్యలు.. ప్రొఫైల్ పిక్చర్ లేని వారి విమర్శలు అసలు పట్టించుకోను! మృతురాలి కుటుంబానికి నాయకుల ఆర్థిక సహాయం వికారాబాద్ జిల్లాలో ఆయుష్ శాఖలో 8 అవుట్‌సోర్సింగ్ పోస్టులు: కలెక్టర్ దీపక్ తివారి టేలర్ స్విఫ్ట్ విరాళం చూపిన అద్భుతం.. నేష్‌విల్ మ్యూజియంలో విద్యా కార్యక్రమాలకు సరికొత్త వెలుగులు! సీట్ల సర్దుబాటుపై కొలిక్కిరాని చర్చలు స్థానిక ఎన్నికలకు టిడిపి సమాయత్తం..

మార్కెట్ అభివృద్ధికి కృషి చేస్తాం మార్కెట్ చైర్‌పర్సన్ రంగినేని స్పందన రాజీవ్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి కృతజ్ఞతలు

Select Suryaa Now
మార్కెట్ అభివృద్ధికి కృషి చేస్తాం  మార్కెట్ చైర్‌పర్సన్ రంగినేని స్పందన రాజీవ్  మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి కృతజ్ఞతలు

మార్కెట్ అభివృద్ధికి కృషి చేస్తాం

మార్కెట్ చైర్‌పర్సన్ రంగినేని స్పందన రాజీవ్

మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి కృతజ్ఞతలు

నేరేడుచర్ల, మేజర్ న్యూస్

నేరేడుచర్ల మార్కెట్ చైర్‌పర్సన్ రంగినేని స్పందన రాజీవ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు, మున్సిపల్ చైర్మన్ కొణతం చిన్న వెంకట్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు, మున్సిపల్ వైస్ చైర్మన్ సందీప్ రెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ రంగినేని స్పందన రాజీవ్ మాట్లాడుతూ, మార్కెట్ అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో కష్టపడి పనిచేసిన తమను గుర్తించి మార్కెట్ కమిటీ పదవులు కల్పించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే మండల, పట్టణ నాయకులకు ధన్యవాదాలు తెలియజేశారు. మార్కెట్ అభివృద్ధి కోసం అందరినీ కలుపుకొని ముందుకు సాగుతానని పేర్కొన్నారు.అనంతరం మండల అధ్యక్షుడు కొణతం చిన్న వెంకట్ రెడ్డి మాట్లాడుతూ, మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్‌గా బాధ్యతలు చేపట్టిన రంగినేని స్పందన రాజీవ్‌కు అభినందనలు తెలిపారు. మార్కెట్ అభివృద్ధికి నాయకులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మునగాల భాస్కర్ రెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, కాంగ్రెస్ నాయకులు చలసాని శ్రీనివాస్ రావు, పార్టీ కార్యకర్తలు, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.